Home » CBN
‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
యువత ఆశలను సీఎం జగన్ వమ్ము చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా పలమనేరులో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జగన్ మోసపూరిత మాటలతో ప్రజలను ఐదేళ్ల పాటు మోసం చేశారన్నారు.
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే ఎన్నో రోడ్ షోలు, సభలు నిర్వహించిన బాబు.. తాజాగా ప్రజాగళం పేరుతో సిద్ధమయ్యారు.
విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తా.. ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతా.. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా..! ఇవీ 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (Jagan) చెప్పిన మాటలు. ఐదేళ్ల వైసీపీ పాలన తర్వాత చూస్తే.. అప్పుల కుప్పలు.. అరాచకాలు.. గుంతల రోడ్లు, మహిళలపై పెరిగిన వేధింపులు, పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యుడు. ఎన్నికల వేళ ఏపీలో జరుగుతున్న ప్రధాన చర్చ ఇదే.
అధికారం రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం.. ప్రజా సేవకు అవకాశం కల్పించాలంటూ ఎన్నికల ముందు ఓటర్ల చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకుంటారు. అధికారం వచ్చాక ప్రజలను పట్టించుకునే నాయకులు కొందరైతే.. అధికారంతో అహం పెంచుకుని అరాచకాలకు పాల్పడే నాయకులు మరికొందరు. ప్రజల ఓట్లతో గెలిచి.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించడం నాయకుడి లక్షణం. కాని ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్ల పాలన చూస్తే మాత్రం ప్రజల ఆశలను, ఆశయాలను వైసీపీ అధినేత జగన్ వమ్ము చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు పార్టీల పొత్తు నిర్ణయం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu).. యువతులకు తియ్యటి వార్త చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి రాగానే 'కలలకు రెక్కలు' అనే పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు అన్నారు.
అమరావతి దేవతల రాజధాని.. దానిని రాక్షసులు చెరబట్టారని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని.. ఇక మిగిలింది 87 రోజులేనని.. లెక్కపెట్టుకోవాలని హెచ్చరించారు. వచ్చే ఏడాది ఇదే ప్రాంతంలో జనసేన–టీడీపీ ప్రభుత్వంలో అద్భుతమైన సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటామని.. బంగారంలాంటి రాజధానిని నిర్మించుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ( CM JAGAN ) ఏపీని మరో 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) పేర్కొన్నారు. శుక్రవారం నాడు కనిగిరిలో సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసభకు టీడీపీ, జనసేన శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కనిగిరి నుంచి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘నేను సైకోకి భయపడను. సైకో పోవాలి.... సైకిల్ రావాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.