Share News

AP Elections 2024: ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. కష్టమేగా జగన్!!

ABN , Publish Date - Mar 21 , 2024 | 08:13 AM

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తా.. ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతా.. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా..! ఇవీ 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (Jagan) చెప్పిన మాటలు. ఐదేళ్ల వైసీపీ పాలన తర్వాత చూస్తే.. అప్పుల కుప్పలు.. అరాచకాలు.. గుంతల రోడ్లు, మహిళలపై పెరిగిన వేధింపులు, పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యుడు. ఎన్నికల వేళ ఏపీలో జరుగుతున్న ప్రధాన చర్చ ఇదే.

AP Elections 2024: ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. కష్టమేగా జగన్!!

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తా.. ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతా.. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా..! ఇవీ 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (Jagan) చెప్పిన మాటలు. ఐదేళ్ల వైసీపీ పాలన తర్వాత చూస్తే.. అప్పుల కుప్పలు.. అరాచకాలు.. గుంతల రోడ్లు, మహిళలపై పెరిగిన వేధింపులు, పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యుడు. ఎన్నికల వేళ ఏపీలో జరుగుతున్న ప్రధాన చర్చ ఇదే. ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) విడుదలతో ఎన్నికల కోలాహలం మొదలైంది. దీంతో పల్లెల్లో ఎక్కడ చూసిన ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. పోలింగ్‌కు దాదాపు మరో 50 రోజుల సమయం ఉన్నా.. ఈసారి ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై ఓటరు తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఐదేళ్ల పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారనే విషయంలో ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది.

అప్పులపై ఆగ్రహం..

తమ ప్రభుత్వ పనితనాన్ని చూసి మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్‌ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జగన్ అరాచక పాలనకు అంతం పలికి.. సుస్థిర అభివ‌ృద్ధ కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని మూడు పార్టీల నేతలు కోరుతున్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా.. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం అప్పులు చేయడం సర్వసాధారణం. కాని ఆదాయాన్ని పెంచకుండా.. మరోవైపు అభివృద్ధి లేకుండా అప్పులు చేయడం ద్వారా రాష్ట్రం దివాళా తీసే స్థితికి చేరుకుంటుందనే విషయం ఇటీవల శ్రీలంకను చూసిన తర్వాత ప్రజలకు బాగా అర్థమైంది. అందుకే కొంతమంది ఏపీని శ్రీలంకగా మార్చడమే జగన్‌ లక్ష్యమంటూ కామెంట్స్ సైతం చేస్తున్నారు.

ఈ విషయాన్ని పక్కన పెడితే ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం వివిధ పేర్లతో లక్షల కోట్ల రూపాయిల అప్పు తీసుకొచ్చింది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈ విషయాన్ని ప్రజలకు నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు. కేవలం కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తాను అమలు చేసిన పథకాలు చూసి ఓట్లు వేయాలని వైసీపీ నేతలు అడుగుతున్నారు. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపి.. పథకాలు ఇస్తున్నానని చెప్పడం ద్వారా వైసీపీ మాటలను కొందరు నమ్మే అవకాశం ఉంది. కాని మెజార్టీ ప్రజలు మాత్రం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల విషయంలో ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. చేసిన అప్పులతో రాష్ట్రం ఏ మేర అభివృద్ధి జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో వైసీపీపై కోపంతో ఉన్న ఓటరు ఎన్నికల్లో తన ఓటుతో సమాధానం చెప్తారా.. లేదా ఈ ఒకసారికి క్షమిస్తారా..? అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలియనుంది.

భారీగా పెరిగిన నాయకుల ఆస్తులు..

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు ఆస్తులు భారీగా పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. అక్రమ మైనింగ్, ఇసుక దోపిడితో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొదలు ఎమ్మెల్యేల వరకు తమ ఆస్తులను పెంచుకున్నారు తప్పితే.. రాష్ట్ర ఆదాయాన్ని, ప్రజల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దోచుకో.. దాచుకో సిద్ధాంతాన్ని వైసీపీ నేతలు బాగా ఫాలో అయ్యారని.. అధినేత నుంని కింది స్థాయి నాయకుడి వరకు అంతా తమ ఆస్తులను భారీగా పెంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సామాన్య ఓటరు అసలు ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

AP Politics: షర్మిల దెబ్బ.. జగన్ అబ్బా.. ఎన్నికలవేళ పీక్స్‌కు చేరిన పాలిటిక్స్..!


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 08:16 AM