Home » celebrations
టీడీపీ అధినేత, ఎన్డీఏ శాసన సభాపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో జిల్లా ప్రజలు పండుగ చేసుకున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కేక్‌లు కట్ చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. ఎన్టీఆర్ విగ్రహాలకు, చంద్రబాబు...
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi). రాష్ట్ర ఆవిర్భావం కోసం అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను కాంగ్రెస్ పార్టీ(Congress Party) నెరవేరుస్తుందని 2004లోనే కరీంనగర్(Karimnagar)లో హామీ ఇచ్చానన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే కేసీఆర్ కలిసి ఆహ్వానించినట్లు వేణుగోపాల్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ పంపిన ఆహ్వాన లేఖను కేసిఆర్‌కు అందజేశానన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను జూన్ 1 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. జూన్ 2న ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారని, అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
: రాజకీయ విందులో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల గుర్తింపునకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలిసింది. విందులో పాల్గొన్నవారంతా అనంతపురం అర్బన, రూరల్ ప్రాంత ఉపాధ్యాయులేనని సమాచారం. వీరిలో అధికశాతం మంది అనంతపురం అర్బన ఓటర్లు. ఎక్కువశాతం వైసీపీ మద్దతుదారులు. గత నెల 31న ఈ రాజకీయ విందు జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉల్లంఘనలపై నిజాయితీగా విచారిస్తున్న అధికారులకు ...
తిరుమల: రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలలో శుక్రవారం రథసప్తమి ఉత్సవాలు జరగనున్నాయి. ఒకేరోజు సప్త వాహనాలపై మలయప్పస్వామి ఆలయ మాడవీధుల్లో విహరించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో బాగంగా ఆదివారం బేడా మండపంలో శ్రీ రంగనాథ గోదాదేవి కళ్యాణ వేడుక జరుగనుంది.
అనేక దేశాల్లో డిసెంబర్ 31తోపాటు న్యూఇయర్ వేడుకలు కూడా గ్రాండ్ గా జరుపుకోవాలని అనేక మంది ప్లాన్ చేస్తున్నారు. కానీ భారత్ పక్కదేశమైన పాకిస్థాన్ మాత్రం ఈ వేడుకల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.
సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో ఇటీవల ప్రవాసాంధ్రులు రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం ఆధ్వర్యంలో దీపావళి సంబురాలను ఉత్సాహాభరితంగా జరుపుకొన్నారు.