Share News

Hyderabad: దశాబ్ది ఉత్సవాల ముగింపు 1 నుంచి : కేసీఆర్‌

ABN , Publish Date - May 28 , 2024 | 03:58 AM

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను జూన్‌ 1 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Hyderabad: దశాబ్ది ఉత్సవాల ముగింపు 1 నుంచి : కేసీఆర్‌

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను జూన్‌ 1 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 1న సాయంత్రం 7 గంటలకు గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, అనంతరం అక్కడి నుంచి ట్యాంక్‌ బండ్‌ సమీపంలోని అమరజ్యోతి వరకు కొవ్వొతుల ర్యాలీ నిర్వహించనున్నారు.


2న తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా, జాతీయ జెండాల ఆవిష్కరణలు ఉంటాయి. అదేరోజు పార్టీ శ్రేణులు హైదరాబాద్‌లోని ఆస్పత్రులు, అనాథ శరణాలయాల్లో, పండ్లు స్వీట్లు పంపిణీ చేస్తాయి. జూన్‌ 3న అన్ని జిల్లాల్లోనూ పార్టీ జెండా, జాతీయ జెండాల ఆవిష్కరణలతోపాటు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్ల పంపిణీ కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Updated Date - May 28 , 2024 | 03:58 AM