Home » Chandra Babu
MCP (మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్) మల్టీస్టార్ మహా కూటమి ఎపీలో సూపర్ డూపర్ హిట్ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఏపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతోందన్నారు. 2019లో జగన్‌ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు ఐదేళ్లు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటోడినా గెలిపించిందని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారని బుద్దా వెంకన్న తెలిపారు.
పల్నాడు జిల్లా పసుమర్రు రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్ ఢీ కొని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి.
తిరుపతి రణరంగంగా మారింది. ఈవీఎంలు భద్రపరిచిన పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద రెచ్చిపోయిన వైసీసీ గూండాలు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
నేడు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే. నామినేషన్ కంటే ముందు దశాశ్వమేధ ఘాట్ సందర్శించనున్నారు. అనంతరం క్రూజ్‌లో నమో ఘాట్ వరకూ ప్రయాణించనున్నారు. ఆ తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారణాశి బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ భావించింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలని బీజేపీ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అనంతరం అక్కడ జరిగే ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
తాము అధికారంలోకి రావడం ఖాయమేనని టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని ఓటర్లంతా ఆంధ్రప్రదేశ్‌కు పోటెత్తారు. అలా వచ్చిన వారంతా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు.
పల్నాడులో హింస పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల లో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని టీడీపీ చెబుతోంది. ఈ ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడడంలో పోలీసు అధికారులు విఫలం అయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా... శాంతి భద్రతలు కాపాడలేకపోయారని చంద్రబాబు విమర్శించారు
ప్రధాని మోదీ(PM Modi) మే 14న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(Varanasi) లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు.