TDP:1994కు మించిన విజయం.. టీడీపీ చరిత్రలోనే అతిపెద్ద సక్సెస్..
ABN , Publish Date - Jun 04 , 2024 | 11:40 AM
దాదాపు 93 శాతం స్ట్రైక్‌రేటుతో విజయం దిశగా ఎన్టీఏ కూటమి పయనిస్తోంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులంతా ఇంటి బాట పడుతున్నారు. 159 స్థానాల్లో విజయం దిశగా కూటమి దూసుకెళుతోంది. తెలుగు దేశం పార్టీ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయం. 1994లో అతి పెద్ద విజయాన్ని టీడీపీ నమోదు చేసింది.
అమరావతి: దాదాపు 93 శాతం స్ట్రైక్‌రేటుతో విజయం దిశగా ఎన్టీఏ కూటమి పయనిస్తోంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులంతా ఇంటి బాట పడుతున్నారు. 160 స్థానాల్లో విజయం దిశగా కూటమి దూసుకెళుతోంది. తెలుగు దేశం పార్టీ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయం. 1994లో అతి పెద్ద విజయాన్ని టీడీపీ నమోదు చేసింది. ఇప్పుడు ఆ విజయాన్ని మించిన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఏపీలో మంత్రులు చాలా వరకూ ఓటమి బాటలోనే పయనిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా కూటమి హవా కొనసాగిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళుతోంది. కొన్ని జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరవలేదు. దీంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. మంత్రి రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఉషశ్రీ చరణ్ వంటి వారంతా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. వైసీపీకి చెందిన హేమాహేమీలు సైతం ఓటమి దిశలోనే పయనిస్తున్నారు. పెద్దిరెడ్డి, గుడివాడ అమరనాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వారంతా ఓటమికి చేరువలో ఉన్నారు.