Share News

Election Results: చంద్రబాబుకు బంపర్ ఆఫర్.. స్వయంగా చెప్పిన మోదీ..

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:38 PM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం కూటమి సంచలనం విజయం దక్కించుకుంది. పొత్తులో భాగంగా 144 శాసనసభ స్థానాల్లో పోటీచేసిన టీడీపీ130కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది.

Election Results: చంద్రబాబుకు బంపర్ ఆఫర్.. స్వయంగా చెప్పిన మోదీ..
Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం కూటమి సంచలనం విజయం దక్కించుకుంది. పొత్తులో భాగంగా 144 శాసనసభ స్థానాల్లో పోటీచేసిన టీడీపీ130కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ పోటీచేసిన 10 స్థానాలకు 8 స్థానాల్లో గెలిచింది. దీంతో కూటమి160కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. ఏపీలో ఘన విజయం సాధించడంతో పాటు.. ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారం చేపట్టడంతో టీడీపీ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును జాతీయ రాజకీయాల్లో కీలకం చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఎన్డీయే కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మరోసారి చంద్రబాబుకు ఎన్డీయే కన్వీనర్ బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయేలో బీజేపీ తర్వాత ఎక్కువ ఎంపీ సీట్లు కలిగిన పార్టీగా టీడీపీ ఉండగా.. ఆ తర్వాత నితీష్ నేతృత్వంలోని జేడీయూ ఉంది. దీంతో ఇతర పార్టీలను ఎన్డీయేలోకి తీసుకురావాలంటే చంద్రబాబుకు కన్వీనర్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

AP Election Result 2024 Live Updates: టెన్షన్ టెన్షన్.. ఏపీ అసెంబ్లీ కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్.


చంద్రబాబుతో చర్చలు..

ఎన్డీయే కన్వీనర్ బాధ్యతల విషయమై ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్‌ షా చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో ఘన విజయం సాధించడంపై చంద్రబాబుకు అభినందనలు తెలిపిన మోదీ, అమిత్‌ షా ఎన్డీయే కన్వీనర్‌ విషయమై టీడీపీ అధినేతతో చర్చించినట్లు సమాచారం. ఇదే జరిగితే జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించనున్నారు.


Lok Sabha Election Results 2024 Live Updates: దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 04 , 2024 | 03:38 PM