Home » Chandra Babu
ఈ రోజు సాయంత్రం 3.30 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలను కలువనున్నారు. ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి చోటు చేసుకుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కృత్తివెన్ను రోడ్డు ప్రమాద క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముందస్తుగా రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొని ఆరుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు చకచకా పనులు చక్కదిద్దుతూ ప్రతి ఒక్కరి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటున్నారు. ఇవాళ నారా భువనేశ్వరి సైతం ట్విటర్ వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబును తన ప్రాణం గానూ.. తనలో సగంగానూ భువనేశ్వరి పేర్కొన్నారు.
ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం..
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో సీఎం చంద్రబాబు మార్పు చూపించారు. మాజీ సీఎం జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయవద్దని ఆదేశించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భవనాలకు అప్పటి ప్రభుత్వం పార్టీ రంగులు వేయించింది.
నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే గత సీఎం పర్యటనకు కట్టినట్లే మళ్లీ దారి వెంట అధికారులు చంద్రబాబు పర్యటనకు సైతం పరదాలు కట్టారు. తన పర్యటనల్లో పరదాలు, అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకు ఒడిశా అవుట్ గోయింగ్ ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ బుధవారంనాడు అభినందనలు తెలిపారు.
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అలాగే చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ సమాధానమిది. ఏకంగా డిప్యూటీ సీఎంగానే అసెంబ్లీలో పవన్ అడుగు పెట్టబోతున్నారు. వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమే.
కూటమికి ప్రజలు పట్టం కట్టిన తీరు అద్భుతమని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. తనపై నమ్మకంతో చంద్రబాబు తనకు మంత్రిగా అవకాశం కల్పించారన్నారు. పాత, కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు చాలా బాగుందని పార్థసారధి ప్రశంసించారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకి ఉందన్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా బెజవాడ మొత్తం పోలీసుల అష్టదిగ్బంధనంలో ఉంది. వారధి, ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి విజయవాడలోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. వారధి వద్ద గుంటూరు వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అదే విధంగా గుంటూరులోనే జాతీయ రహదారి పైకి వాహనాలను అనుమతించడం లేదు.