Share News

Chandrababu: చంద్రబాబు, జగన్‌ల షెడ్యూల్‌పై ఏపీలో ఇంట్రస్టింగ్ చర్చ

ABN , Publish Date - Jul 04 , 2024 | 09:35 AM

ఏపీలో ఇవాళ ఇంట్రస్టింగ్ టాపిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిల షెడ్యూల్ ఆసక్తికర చర్చకు దారి తీసింది...

Chandrababu: చంద్రబాబు, జగన్‌ల షెడ్యూల్‌పై ఏపీలో ఇంట్రస్టింగ్ చర్చ

అమరావతి: ఏపీలో ఇవాళ ఇంట్రస్టింగ్ టాపిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిల షెడ్యూల్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతుంటే.. జగన్ మాత్రం.. హత్యాయత్నం కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ‌ష్ణారెడ్డిని పరామర్శించేందుకు వెళ్లనున్నారు. సీఐ, టీడీపీ ఏజెంట్లపై దాడి, ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ చేసి జైల్లో ఉన్న ఒక నిందితుడితో మాట్లాడేందుకు జగన్ వెళుతున్నారు. పోలింగ్ రోజు పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన సీసీటీవీ ఫుటేజ్ చూసి సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయిన సంగతి అందరికీ తెలిసిందే. దశాబ్ద కాలంగా మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. విసిగి వేసారి ఎన్నికల్లో పిన్నెల్లిని మాచర్ల జనం చిత్తు చిత్తుగా ఓడించారు.


మోదీతో భేటీలో అమరావతి, పోలవరంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానితో చంద్రబాబు మాట్లాడనున్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులో ఐదేళ్ల విధ్వంసం, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానితో మాట్లాడి నిధులు రాబట్టే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. నిధుల మళ్లింపు, ఆర్థిక అవకతవకలు, రాష్ట్రం ఖజానా ఖాళీ, ఆర్థిక సాయంపై చర్చించనున్నారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం, జగన్ హత్యాయత్నం కేసులో నిందితుడిని చూసేందుకు వెళ్తున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఒకే రోజు ఇరువురు నేతల షెడ్యూల్‌పై సోషల్ మీడియాలో సెటైర్‌లు వైరల్ అవుతున్నాయి.

Updated Date - Jul 04 , 2024 | 11:18 AM