Home » Chandrababu Cabinet
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీతోపాటు జనసేన, బీజేపీకి చెందిన సభ్యులు ఇటీవల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు సీఎం చంద్రబాబు ఈ రోజు శాఖలు కేటాయించారు.
ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం..
అరకులోయ పార్లమెంట్ స్థానంలో సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ (Telugu Desam) ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు...
పార్టీలోని కొత్త తరాన్ని అధికార అందలమెక్కించేలా చంద్రబాబు తన బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరానికి కేబినెట్‌లో అధిక స్థానాలు కేటాయించారు.
ఆయనది మూడు దశాబ్దాల రాజకీయం. ఎన్టీఆర్ పిలుపుతో 1994లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయస్సు 29 ఏళ్లు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే తూటాలా పేలుతుంది. భాషపై పట్టు.. యాస, ప్రాసను సమపాళ్లలో పండించగల దిట్ట. మైక్ తీసుకున్నారంటే మాటాల్లో వాడి.. వేడి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనే ..