Home » Chennai News
రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచేందుకు, నాణ్యమైన విద్యనందించేందుకు పీఎంశ్రీ అత్యంత అవసరమంటూ ఈ పథకాన్ని అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తరువాత వ్యతిరేకించడం గర్హనీయమని గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) ఆరోపించారు.
తమ సినిమాల టిక్కెట్లను అభిమానులకే అధిక ధరలకు విక్రయించే వారు దేశాన్ని కాపాడగలరా? అంటూ మంత్రి టీఎం అన్బరసన్(Minister TM Anbarasan) హీరో విజయ్ను ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు. బుధవారం రాత్రి మాంగాడులో జరిగిన డీఎంకే ఆలందూరు నియోజకవర్గ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
తమకు నానాటికీ శత్రువులు పెరిగిపోతున్నారని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో సుహృద్భావ వాతావరణంలో కూటమి ఏర్పడే అవకాశాలు లేవని మంత్రి కేఎన్ నెహ్రూ(Minister KN Nehru) వ్యాఖ్యానించారు. తిరుచ్చి జిల్లా లాల్గుడి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డీఎంకే ప్రతినిధుల సమావేశం జరిగింది.
తన ఎదుట ఎవరైనా తమిళంలో మాట్లాడితే సులువుగా అర్థమవుతోందని, త్వరలో ఆ భాష నేర్చుకుని సునాయాసంగా మాట్లాడుతానని గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) పేర్కొన్నారు. తమిళనాడు హిందీ సాహిత్య అకాడమీ, డీజీ వైష్ణవ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
విజయదశమి, దీపావళి పండుగల సందర్భంగా చెన్నై ఎగ్మూర్-విశాఖపట్టణం, విశాఖపట్టణం-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా రాజధాని నగరం చెన్నై(CHENNAI) నుంచి వెళ్లాల్సిన 18 ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దుచేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. డా.ఎంజీఆర్ సెంట్రల్, ఎగ్మూర్, తాంబరం రైల్వే స్టేషన్ల నుంచి వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే సోమవారం ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కన్నియాకుమారి జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ కుండపోత వర్షం కురిసింది. గురువారం రాత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, పెనుగాలులతో కురిసిన వర్షాలకు పల్లపు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.
ఐరోపా దేశాల్లో గుర్తించిన మంకీ ఫీవర్(Monkey fever) రాష్ట్రంలో వ్యాపించకుండా పటిష్టమైన నిరోధక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ప్రకటించారు. కోయంబత్తూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి వెళ్ళారు.
తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పవాయుపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు.
అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin), ఆయన సతీమణి దుర్గ, అధికారులు దుబాయ్ వెళ్తున్న విమానానికి బాంబు బెదరింపు రావటంతో భద్రతాదళం అధికారులు, సిబ్బంది రాత్రంతా తనిఖీలతో జాగారం చేశారు.