Share News

Trains: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. పలు రైళ్ల రద్దు

ABN , Publish Date - Sep 03 , 2024 | 11:46 AM

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా రాజధాని నగరం చెన్నై(CHENNAI) నుంచి వెళ్లాల్సిన 18 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దుచేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. డా.ఎంజీఆర్‌ సెంట్రల్‌, ఎగ్మూర్‌, తాంబరం రైల్వే స్టేషన్ల నుంచి వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే సోమవారం ప్రకటించింది.

Trains: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. పలు రైళ్ల రద్దు

- సెంట్రల్‌, ఎగ్మూర్‌ స్టేషన్లలో ఉత్తరాది ప్రయాణికుల తీవ్ర అవస్థలు

చెన్నై: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా రాజధాని నగరం చెన్నై(CHENNAI) నుంచి వెళ్లాల్సిన 18 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దుచేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. డా.ఎంజీఆర్‌ సెంట్రల్‌, ఎగ్మూర్‌, తాంబరం రైల్వే స్టేషన్ల నుంచి వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే సోమవారం ప్రకటించింది. దీంతో, ఆ రైళ్లలో వెళ్లాల్సిన వేలాదిమంది ప్రయాణికులు రైల్వేస్టేషన్లలోనే పడిగాపులు కాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రైలుపట్టాలపై వర్షపు నీరు చేరడంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఈ వార్తను కూడా చదవండి: సెబీ చైర్మన్‌ మాధవికి ఏడేళ్లుగా ఐసీఐసీఐ నుంచీ జీతం!


దీంతో సెంట్రల్‌-పూరి, అహ్మదాబాద్‌-సెంట్రల్‌ నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌, సెంట్రల్‌-షాలిమార్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లను పూర్తిగా రద్దు చేశారు. మైసూరు-హౌరా, హౌరా-మైసూరు ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-తాంబరం(Hyderabad-Tambaram), సెంట్రల్‌-ఛాప్రా గంగాకావేరి ఎక్స్‌ప్రెస్‌, చాప్రా-సెంట్రల్‌ సహా 18 రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, తెనాలి, నెల్లూరు(Vijayawada, Rajahmundry, Ongole, Tenali, Nellore), గూడూరు, గుడివాడ, గుంటూరు, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌(Hyderabad, Secunderabad) తదితర 18 రైల్వేస్టేషన్లతో సంప్రదించేందుకు వీలుగా సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక సమాచార కేంద్రం ఏర్పాటుచేశారు.


044-25354995, 25354151 అనే టోల్‌ ఫ్రీ నెంబర్లు కూడా విడుదల చేశారు. రద్దయిన రైళ్ల ప్రకటన విడుదల కావడంతో సంబంధిత రైళ్లలో టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకున్న ప్రయాణికులు, ఆర్డినరీ బోగీల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైళ్ల రద్దు, ఆలస్యం తదితర సమాచారం తెలుసుకొనేందుకు క్యూ ఆర్‌ కోడ్‌ సదుపాయనిఇ్న సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ ప్రవేశద్వారం వద్ద ఏర్పాటుచేశారు. సెంట్రల్‌-ఢిల్లీ జీటీ ఎక్స్‌ప్రెస్‌(Central-Delhi GT Express), తాంబరం-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, సెంట్రల్‌-ఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌, కాకినాడ-బెంగళూరు శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌(Kakinada-Bangalore Seshadri Express) రైళ్లు ఈ నెల 4వ తేది వరకు రద్దుచేశారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 03 , 2024 | 11:46 AM