Share News

Minister: ఇలాంటి నటులు దేశాన్ని కాపాడగలరా?

ABN , Publish Date - Sep 05 , 2024 | 01:03 PM

తమ సినిమాల టిక్కెట్లను అభిమానులకే అధిక ధరలకు విక్రయించే వారు దేశాన్ని కాపాడగలరా? అంటూ మంత్రి టీఎం అన్బరసన్‌(Minister TM Anbarasan) హీరో విజయ్‌ను ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు. బుధవారం రాత్రి మాంగాడులో జరిగిన డీఎంకే ఆలందూరు నియోజకవర్గ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Minister: ఇలాంటి నటులు దేశాన్ని కాపాడగలరా?

- అభిమానులకే అధిక ధరలకు టిక్కెట్ల విక్రయం

- మంత్రి అన్బరసన్‌ వ్యాఖ్యలు

చెన్నై: తమ సినిమాల టిక్కెట్లను అభిమానులకే అధిక ధరలకు విక్రయించే వారు దేశాన్ని కాపాడగలరా? అంటూ మంత్రి టీఎం అన్బరసన్‌(Minister TM Anbarasan) హీరో విజయ్‌ను ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు. బుధవారం రాత్రి మాంగాడులో జరిగిన డీఎంకే ఆలందూరు నియోజకవర్గ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల రాజకీయ పార్టీని స్థాపించిన ఒక నటుడు పబ్లిక్‌ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందజేస్తున్నారని, కానీ తమ పార్టీ ఎప్పటి నుంచో ఈ తరహా బహుమతులు ఇస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోందన్నారు.

ఇదికూడా చదవండి: Amit Shah: త్రిపురలో ముగిసిన తిరుగుబాటు


ఒక సినిమాకు రూ.200 కోట్ల వరకు పారితోషికం తీసుకునే హీరో విజయ్‌(Hero Vijay).. తన అభిమానులకు తన కొత్త సినిమా విడుదల రోజున ఉచితంగా టిక్కెట్లు పంపిణీ చేయలేరా అని ప్రశ్నించారు. తన సినిమా టిక్కెట్లను తన అభిమానులకే రూ.2 వేలు చొప్పున విక్రయిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోందని, అందువల్ల ప్రతి నేతా ఇంటింటికి వెళ్ళి కొత్త సభ్వత్వాలపై చర్యలు తీసుకోవాలన్నారు.


ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 40 లోక్‌సభ స్థానాలకు 40 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నామని, వచ్చే 2026లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఫలితాలు పునరావృతమయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేసమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు మరింతగా చేరువ చేసేలా ప్రచారం చేయాలని మంత్రి అన్బరసన్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


....................................................................

ఈ వార్తను కూడా చదవండి:

......................................................................

Minister: మాకు శత్రువులు పెరిగిపోతున్నారు..

- మంత్రి కేఎన్‌ నెహ్రూ

చెన్నై: తమకు నానాటికీ శత్రువులు పెరిగిపోతున్నారని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో సుహృద్భావ వాతావరణంలో కూటమి ఏర్పడే అవకాశాలు లేవని మంత్రి కేఎన్‌ నెహ్రూ(Minister KN Nehru) వ్యాఖ్యానించారు. తిరుచ్చి జిల్లా లాల్గుడి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డీఎంకే ప్రతినిధుల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న మంత్రి నెహ్రూ మాట్లాడుతూ ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఏర్పాటైన కూటమి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పునరావృతమవుతుందా లేదా అన్నది అనుమానమన్నారు. ఎందుకంటే, సీమాన్‌ మనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

nani1.jpg


మరో నటుడు కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించారు. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో మేమేనంటూ అన్నాడీఎంకే(AIADMK) ప్రచారం చేసుకుంటుందన్నారు. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నప్పటికీ పీఎంకే విమర్శలు చేస్తూనే ఉందని, ఇక బీజేపీ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. అందువల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సామసరస్యపూర్వక కమిటీ ఏర్పడుతుందా? లేదా? అన్నది సందేహాస్పదమన్నారు. అయినప్పటికీ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని మంత్రి నెహ్రూ పిలుపునిచ్చారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 05 , 2024 | 01:03 PM