Minister: మంకీ ఫీవర్ నిరోధక చర్యలు చేపడుతున్నాం..
ABN , Publish Date - Aug 31 , 2024 | 12:04 PM
ఐరోపా దేశాల్లో గుర్తించిన మంకీ ఫీవర్(Monkey fever) రాష్ట్రంలో వ్యాపించకుండా పటిష్టమైన నిరోధక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ప్రకటించారు. కోయంబత్తూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి వెళ్ళారు.
- మంత్రి సుబ్రమణ్యం
చెన్నై: ఐరోపా దేశాల్లో గుర్తించిన మంకీ ఫీవర్(Monkey fever) రాష్ట్రంలో వ్యాపించకుండా పటిష్టమైన నిరోధక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ప్రకటించారు. కోయంబత్తూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి వెళ్ళారు. అక్కడి విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐరోపాలో గుర్తించిన మంకీ ఫీవర్ ప్రస్తుతం 121 దేశాలకు వ్యాపించిందని, ఆ వైరస్ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించిందని తెలిపారు. రాష్ట్రంలో విదేశాల నుంచి మంకీ ఫీవర్ వ్యాపించకుండా ఉండేందుకుగాను ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) సూచనల మేరకు చెన్నై, కోవై, మదురై, తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మంకీ ఫీవర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: PM Modi: రెండు రోజుల పాటు జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సు.. హాజరైన మోదీ
అంతే కాకుండా చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి(Chennai, Coimbatore, Madurai, Trichy) విమానాశ్రయాలలో మంకీఫీవర్ బాధిత విదేశీయుల కోసం ప్రత్యేక వార్డులు కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైనా మంకీ ఫీవర్ ఉన్నట్లు గుర్తిస్తే వారిని ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తామన్నారు. విమానాశ్రయాలలో ప్రత్యేక వైద్యసిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని చెప్పారు. అంతే కాకుండా విదేశీ ప్రయాణికులకు మంకీ ఫీవర్ పరీక్షలు కూడా జరుపుతున్నట్లు చెప్పారు.
ఇక చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి నగరాల్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో తలా 10 పడకల సదుపాయంతో మంకీఫీవర్ బాధితులకు ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యకళాశాలల ఆసుపత్రుల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, నిఘా కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. ఆ తర్వాత ఆయన కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న వైద్యసేవలను గురించి అడిగి తెలుసుకున్నారు.
..........................................................
ఈ వార్తను కూడా చదవండి:
..........................................................
Heavy Rains: తమిళనాడు కుమరిలో కుండపోత..
- స్తంభించిన జనజీవనం
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కన్నియాకుమారి జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ కుండపోత వర్షం కురిసింది. గురువారం రాత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, పెనుగాలులతో కురిసిన వర్షాలకు పల్లపు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. శుక్రవారం ఉదయం 7.30 గంటల నుండి గంటసేపు కుండపోతగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతూ వానలో తడుస్తూనే పాఠశాలకు వెళ్లారు.
నాగర్‌కోవిల్(Nagercoil)లోని మీనాక్షిపురం రోడ్డు, అశంబురోడ్డు కోట్టార్ రోడ్డు తదితర రహదారుల్లో వర్షపునీరు వరదలా ప్రవహించింది. తక్కలై, కుళిత్తురై, మార్తాండం, ఇరానియల్, మయిలాడి, కొట్టారం, అంజుగ్రామం, ఆరల్‌వాయ్‌మొళి, ముల్లంగివినై తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి జోరుగా వర్షం కురిసింది. తిరుపరప్పు జలపాతం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఆ ప్రాంతం వద్ద చల్లటి వాతావరణం చోటుచేసుకుంది. ఆరోగ్యపురం నుంచి నీరోడి వరకు సముద్రతీర గ్రామాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సముద్రంలో చేపలవేటకు వెళ్ళి జాలర్లంతా వర్షం కారణంగా తిరుగుముఖం పట్టారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News