Home » Chennai
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024) ఫైనల్ మ్యాచ్ సమయం రానే వచ్చింది. రేపు (మే 26న) సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. చెన్నై(chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచి మళ్లీ చరిత్రను పునరావృతం చేసే మంచి ఛాన్స్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 చివరకు దశకు వచ్చేసింది. ఈ సీజన్‌లో ట్రోఫీని కైవసం చేసుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు రేపు (మే 26) తలపడనున్నాయి. అయితే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉందా, ఉంటే ఎలా అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో రేపు కీలక క్వాలిఫయర్ 2 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడితే ఫైనల్స్‌కు ఏ జట్టు చేరుతుందో ఇప్పుడు చుద్దాం.
ఏదైనా ఘటనపై సోషల్ మీడియాలో స్పందించడం ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. అసలు విషయం తెలుసుకోకుండా అతిగా స్పందించడం అనార్థాలకు దారితీస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనం తమిళనాడులోని కొయ్యంబత్తూరులో జరిగిన ఘటన. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టడంతో పాటు.. తన చిన్నారిపై తల్లికి ప్రేమ లేదనేవిధంగా కామెంట్స్ పెట్టి.. ట్రోల్ చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన వరుస విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఆ యా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఐసీఐసీఐ(ICICI) ఫైనాన్షియల్ గ్రూప్‌కు పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ నారాయణన్ వాఘుల్(Narayanan Vaghul) ఈరోజు(మే 18న) కన్నుముశారు. 88 ఏళ్ల వయస్సులో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గత రెండు రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు.
చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి(Chennai Central to Tirupati) వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు బుధవారం నుంచి ఈ నెల 31వ తేది వరకు తిరుపతికి బదులుగా రేణిగుంట వరకు మాత్రమే వెళతాయని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ డాక్టర్ కె.విశ్వనాథన్‌కు అమెరికాలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ (బింగ్ హాంటన్ యూనివర్సిటీ) గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగానే నిలుపుకొంది. అలాగే ఇతర జట్లకు కూడా తమ విజయంతో ఊపిరిలూదింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ విస్ఫోటం సంభవించింది. హఠాత్తుగా సంభవించిన పేలుడు కారణంగా ఐదుగురు మహిళలు సహా 8మంది దుర్మరణం చెందారు.