IPL GT VS CSK : టైటాన్స్ రేసులోనే
ABN , Publish Date - May 11 , 2024 | 05:19 AM
ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగానే నిలుపుకొంది. అలాగే ఇతర జట్లకు కూడా తమ విజయంతో ఊపిరిలూదింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్
చెన్నైపై ఘనవిజయం
గిల్, సుదర్శన్ సెంచరీలు
పోరాడిన మిచెల్, అలీ
మోహిత్‌కు 3 వికెట్లు
నేటి మ్యాచ్
కోల్‌కతా X ముంబై
రాత్రి 7.30 గం. వేదిక: కోల్‌కతా
అహ్మదాబాద్: ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగానే నిలుపుకొంది. అలాగే ఇతర జట్లకు కూడా తమ విజయంతో ఊపిరిలూదింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104), సాయి సుదర్శన్ (51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103) శతకాల మోతెక్కించడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 35 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే 10 పాయింట్లతో ఆఖరి నుంచి ఎనిమిదో స్థానానికి చేరింది. ఇక చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అటు డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం చెత్త ఆటతో చిత్తయ్యింది. ఆరు విజయాలు, ఆరు ఓటములతో సీఎ్‌సకే 12 పాయింట్లతోనే ఉంది. ఈ జట్టు కూడా మిగిలిన రెండు మ్యాచ్‌లను కచ్చితంగా నెగ్గాల్సిందే. ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. తుషార్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసి ఓడింది. మిచెల్ (34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63), మొయిన్ అలీ (36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) అర్ధసెంచరీలు సాధించారు. మోహిత్‌కు మూడు, రషీద్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా గిల్ నిలిచాడు.
మిచెల్, అలీ పోరాడినా..: భారీ ఛేదనలో చెన్నై ఇన్నింగ్స్ దారుణంగా ఆరంభమైంది. తొలి మూడు ఓవర్లలోనే టాపార్డర్ బ్యాటర్లు రచిన్ (1), రహానె (1), రుతురాజ్ (0) పెవిలియన్‌కు చేరారు. ఈ స్థితిలో డారిల్ మిచెల్, మొయిన్ అలీ నాలుగో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేపారు. కానీ వీరి నిష్క్రమణతో జట్టు కూడా తడబడింది. ఇద్దరి బౌండరీల ధాటికి పవర్‌ప్లేలో జట్టు 43/3తో కోలుకుంది. ఆ తర్వాత మిచెల్ మరింత వేగం చూపుతూ ఎనిమిదో ఓవర్‌లో మూడు ఫోర్లు బాదాడు. 27 బంతుల్లోనే తను ఫిఫ్టీ సాధించగా.. అలీ కూడా 11వ ఓవర్‌లో 6,6,6తో స్కోరును వంద దాటించాడు. స్పిన్నర్ రషీద్ ఓవర్‌లోనూ మిచెల్ 4,6తో జోరు చూపాడు. ఈ జోడీ క్రీజులో ఉన్నంత సేపు చెన్నై సరైన దారిలోనే వెళ్లింది. కానీ కెప్టెన్ గిల్ పేసర్ మోహిత్‌కు బంతినివ్వడంతో పరిస్థితి తారుమారైంది. అతడు తన వరుస ఓవర్లలో మిచెల్, అలీ, దూబే (21) వికెట్లు తీయడంతో చెన్నై ఇక కోలుకోలేకపోయింది. 18వ ఓవర్‌లో జడేజా (18), శాంట్నర్ (0)లను స్పిన్నర్ రషీద్ దెబ్బతీశాడు. చివరి ఓవర్‌లో ధోనీ (26 నాటౌట్) 6,6,4తో మురిపించినా.. ఫలితం లేకపోయింది.
ఓపెనర్ల సెంచరీలు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ సెంచరీలతో కదం తొక్కారు. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించడంతో చెన్నై బౌలర్లు బంతులు వేయడం తప్ప చేసేదేమీ లేకపోయింది. దీంతో 17 ఓవర్లపాటు ఇద్దరు బ్యాటర్లదే ఆధిపత్యం సాగింది. ఆరంభం నుంచే బాల్ చక్కగా బ్యాట్ మీదికి రావడంతో సాయి, గిల్ పోటాపోటీగా ఆడేస్తూ ఓవర్‌కు 12 పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లారు. దీంతో 250 స్కోరు పక్కా అనిపించినా ఆఖర్లో బౌలర్లు కాస్త కట్టడి చేశారు. పవర్‌ప్లేలో జట్టు 58 పరుగులు చేశాక సుదర్శన్ మరింత జోరు చూపాడు. తొమ్మిదో ఓవర్‌లో అతడు 4,6తో 32 బంతుల్లో ఫిఫ్టీ చేరుకున్నాడు. ఇక 11వ ఓవర్‌లో గిల్ 6,4తో 25 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించగా.. అటు సాయి మరో రెండు సిక్సర్లతో 23 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా 13వ ఓవర్‌లో సాయి 4,6 బాదగా.. మిచెల్ ఓవర్‌లో గిల్ మూడు సిక్సర్లతో 19 రన్స్ అందించాడు. ఇదే ఓవర్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను తుషార్ వదిలేశాడు. దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న గిల్ ఓ ఫోర్‌తో.. ఆ వెంటనే సుదర్శన్ 6తో 17వ ఓవర్‌లో 50 బంతుల్లోనే తమ శతకాలను పూర్తి చేసుకున్నారు. అయితే 16వ ఓవర్‌లో ఆరు పరుగులే ఇచ్చిన తుషార్.. 18వ ఓవర్‌లో నాలుగు రన్స్ ఇచ్చి సుదర్శన్, గిల్ వికెట్లతో చెన్నైకి రిలీ్‌ఫనిచ్చాడు. ఆ తర్వాత స్కోరులో వేగం తగ్గింది. ఓవరాల్‌గా గుజరాత్ చివరి మూడు ఓవర్లలో 22 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి.. కేవలం ఒక్క ఫోర్ మాత్రమే సాధించింది.
స్కోరుబోర్డు
గుజరాత్: సాయి సుదర్శన్ (సి) దూబే (బి) దేశ్‌పాండే 103, గిల్ (సి) జడేజా (బి) దేశ్‌పాండే 104, మిల్లర్ (నాటౌట్) 16, షారుక్ (రనౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 231/3; వికెట్ల పతనం: 1-210, 2-213, 3-231; బౌలింగ్: శాంట్నర్ 2-0-31-0, తుషార్ దేశ్‌పాండే 4-0-33-2, శార్దూల్ 4-0-25-0, సిమర్‌జీత్ 4-0-60-0, జడేజా 2-0-29-0, మిచెల్ 4-0-52-0.
చెన్నై: రహానె (సి) తెవాటియా (బి) సందీప్ 1, రచిన్ (రనౌట్) 1, రుతురాజ్ (సి) రషీద్ (బి) ఉమేశ్ 0, మిచెల్ (సి) షారుక్ (బి) మోహిత్ 63, మొయిన్ అలీ (సి) నూర్ (బి) మోహిత్ 56, దూబే (సి) నూర్ (బి) మోహిత్ 21, జడేజా (సి) మిల్లర్ (బి) రషీద్ 18, ధోనీ (నాటౌట్) 26, శాంట్నర్ (బి) రషీద్ 0, శార్దూల్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 196/8; వికెట్ల పతనం: 1-2, 2-2, 3-10, 4-119, 5-135, 6-165, 7-169, 8-169; బౌలింగ్: ఉమేశ్ 3-0-20-1, సందీప్ 3-0-28-1, త్యాగి 4-0-51-0, నూర్ అహ్మద్ 2-0-25-0, రషీద్ 4-0-38-2, మోహిత్ 4-0-31-3.
ఐపీఎల్‌లో ఎక్కువ శతకాలు (13) నమోదవడం ఇదే తొలిసారి.
ఒకే ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు రావడం ఇది మూడోసారి. గతంలో బెంగళూరు, సన్‌రైజర్స్ జట్ల నుంచి నమోదయ్యాయి.
గుజరాత్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల (209)
భాగస్వామ్యం నమోదు చేసిన సాయి సుదర్శన్-గిల్.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
కోల్‌కతా 11 8 3 0 16 1.453
రాజస్థాన్ 11 8 3 0 16 0.476
హైదరాబాద్ 12 7 5 0 14 0.406
చెన్నై 12 6 6 0 12 0.491
ఢిల్లీ 12 6 6 0 12 -0.316
లఖ్‌నవూ 12 6 6 0 12 -0.769
బెంగళూరు 12 5 7 0 10 0.217
గుజరాత్ 12 5 7 0 10 -1.063
ముంబై 12 4 8 0 8 -0.212
పంజాబ్ 12 4 8 0 8 -0.423