IPL 2024: హైదరాబాద్ జట్టు గెలిచి మళ్లీ చరిత్రను పునరావృతం చేస్తుందా?
ABN , Publish Date - May 25 , 2024 | 08:28 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024) ఫైనల్ మ్యాచ్ సమయం రానే వచ్చింది. రేపు (మే 26న) సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. చెన్నై(chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచి మళ్లీ చరిత్రను పునరావృతం చేసే మంచి ఛాన్స్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024) ఫైనల్ మ్యాచ్ సమయం రానే వచ్చింది. రేపు (మే 26న) సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. చెన్నై(chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. అయితే క్వాలిఫయర్స్1లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్‌కు చేరుకోవడంతో అందరి చూపు ఈ మ్యాచ్‌పైనే ఉంది. ఫైనల్లో తొలి క్వాలిఫయర్‌లో హైదరాబాద్(SRH)ను 8 వికెట్ల తేడాతో ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. రెండో క్వాలిఫయర్‌లో విజయం సాధించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్‌ను అత్యధిక సార్లు ఆడిన ఐదవ జట్టుగా అవతరించింది.
ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు గెలిచి మళ్లీ చరిత్రను పునరావృతం చేసే మంచి ఛాన్స్ వచ్చింది. ఏ విధంగా అంటే ఆరెంజ్ ఆర్మీ 2016లో కూడా ఇలాగే టైటిల్‌ను గెలుచుకుంది. అప్పుడు డేవిడ్ వార్నర్ నేతృత్వంలో రెండో క్వాలిఫయర్‌లో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ సమయంలో SRH జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, ఎలిమినేటర్‌లో కేకేఆర్(KKR)ను ఓడించింది ఆ తర్వాత రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ లయన్స్‌ను, ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించింది.
ఇక ముంబయి ఇండియన్స్(MI) రెండుసార్లు ఇలాంటి ఘనతను సాధించింది. 2013, 2017లో ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫయర్‌లో గెలిచి టైటిల్‌ను గెలుచుకుంది. 2013లో MI మొదటి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత రెండో క్వాలిఫయర్‌లో ముంబయి రాజస్థాన్‌ను ఓడించింది. ఫైనల్‌లో CSKతో జరిగిన మొదటి క్వాలిఫయర్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
2017లో ముంబై ఇండియన్స్(MI) కథ మళ్లీ పునరావృతమైంది. తొలి క్వాలిఫయర్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ చేతిలో ఎంఐ ఓడిపోయింది. ఆ తర్వాత రెండో క్వాలిఫయర్‌లో కోల్‌కతాను ఓడించిన ముంబై ఫైనల్లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌ను ఓడించింది. MI ఇప్పటి వరకు మొత్తం ఐదు IPL టైటిళ్లను గెలుచుకుంది, వాటిలో రెండు రెండో క్వాలిఫైయర్‌లో గెలిచిన తర్వాత విజయం సాధించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు మూడోసారి టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా మూడుసార్లు ఫైనల్ ఆడింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక సార్లు ఫైనల్ ఆడింది. ఈ జట్టు 10 సార్లు ఫైనల్స్‌కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు 6 సార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నాలుగుసార్లు ఫైనల్స్ ఆడగా రెండుసార్లు విజేతగా నిలిచింది.
ఇది కూడా చదవండి:
IPL 2024: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం కురుస్తుందా.. వెదర్ రిపోర్ట్ ఏం చెబుతుంది
Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.
Read Latest Sports News and Telugu News