Home » Chennai
మదురై జిల్లా మేలూరు సమీపం కీళ్వలైపు ప్రాంతం వద్ద విదేశాల్లో వ్యాపారం చేసే యువకుడిపై గుర్తు తెలియిని దుండగులు టిఫిన్బాక్స్ బాంబుతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఆ యువకుడు, ఆటోడ్రైవర్ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
చెన్నై: కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వేలూరు ప్రజలతో మమేకం అవుతున్న ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావటంతో పక్కనే ఉన్న వాలంటీర్లు ఆసుపత్రికి తరలించారు.
చెన్నై సమీప కుండ్రత్తూర్ వద్ద మినీ లారీలో తరలించిన 1,000 కిలోల బంగారు కడ్డీలను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 425 కిలోల
ఎన్నికల వేళ.. చెన్నై మహానగరంలో భారీగా నగదు పట్టుబడింది. తాంబరం రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా రూ. 4 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రయాణికుల రద్దీ నియంత్రించేలా చెన్నై ఎగ్మూర్ - నాగర్కోయిల్ మధ్య వందే భారత్ ప్రత్యేక రైళ్లు(Vande Bharat Special Trains) నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
ఐపీఎల్ 2024 (IPL 2024) పోరు నేడు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సందర్భంగా ప్రధానంగా పలువురు కీలక ఆటగాళ్లపై ఎక్కువ మంది అభిమానులు(fans) ఫోకస్ చేశారు. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చుద్దాం.
ఐపీఎల్ 2024 17వ సీజన్ ప్రారంభానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. రేపు జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచులో ఏ జట్టుకు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
తమిళిసై ఇవాళ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
ఫ్లైయింగ్ ట్యాక్సీని ఐఐటీ మద్రాస్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి రూపొందించారు. ఆ ట్యాక్సీకి e200 అని పేరు కూడా పెట్టారు. తన ఫ్లైయింగ్ ట్యాక్సీకి సంబంధించిన వివరాలను సత్య చక్రవర్తి మీడియాకు వెల్లడించారు. e200 ట్యాక్సీ రూపకల్పన, భద్రత ప్రమాణాలు, నియంత్రణ, పట్టణ రవాణాపై ప్రభావం లాంటి అంశాలను వివరించారు.
తిరుపతి సెక్షన్లో చేపడుతున్న మరమ్మతుల కారణంగా తిరుపతికి వెళ్లే పలు ఎక్స్ప్రెస్లు రద్దు చేయగా, మరికొన్ని పాక్షికంగా, మరికొన్నింటిని ఇతర మార్గాల్లో నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే పేర్కొంది.