Share News

DMK: డీఎంకే శ్రేణుల అత్యుత్సాహం.. ఆంగ్ల అక్షరాలకు తారు పూత

ABN , Publish Date - Feb 27 , 2025 | 12:26 PM

తెన్‌కాశి జిల్లాలోని కడయనల్లూరు వద్ద డీఎంకే(DMK) స్థానిక శాఖ నాయకులు హిందీ వ్యతిరేక ఆందోళనలో భాగం అక్కడి రైల్వేస్టేషన్‌(Railway station) వద్దనున్న నేమ్‌బోర్డుపై హిందీలో ఉన్న స్టేషన్‌ పేరుపై తారు పూయాలని వెళ్ళారు.

DMK: డీఎంకే శ్రేణుల అత్యుత్సాహం.. ఆంగ్ల అక్షరాలకు తారు పూత

చెన్నై: తెన్‌కాశి జిల్లాలోని కడయనల్లూరు వద్ద డీఎంకే(DMK) స్థానిక శాఖ నాయకులు హిందీ వ్యతిరేక ఆందోళనలో భాగం అక్కడి రైల్వేస్టేషన్‌(Railway station) వద్దనున్న నేమ్‌బోర్డుపై హిందీలో ఉన్న స్టేషన్‌ పేరుపై తారు పూయాలని వెళ్ళారు. కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కారుకు, నిర్బంధ హిందీ వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ స్టేషన్‌లోకి వెళ్లారు. ప్లాట్‌ఫాం వద్దకు వెళ్ళి అక్కడే ఉన్న మూడు భాషలతో స్టేషన్‌పేర్లున్న గోడవద్దకు చేరుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Ranjana: తేల్చిచెప్పేసిన సినీనటి.. ఇక టీవీకేతోనే నా రాజకీయ పయనం..


పార్టీ నాయకుడొకరు చిన్న నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి డబ్బాలోని తారునూ హిందీ అక్షరాలపై పూయడానికి బదులు హిందీలో స్టేషన్‌ పేరుకు దిగువ ఉన్న ఆంగ్ల అక్షరాలపై తారు పూశారు. ఆ దృశ్యాన్ని చూసి కార్యకర్తలు దిగ్ర్భాంతి చెంది, ఇంగ్లీషు అక్షరాలపై తారు పూశావంటూ ఆ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పు తెలియటంతో ఆ నాయకుడు నాలుక్కరచుకుని హిందీ అక్షరాలపై తారు పూశారు. ప్రస్తుతం ఆ నాయకుడు ఆంగ్ల అక్షరాలపై తారు పూస్తున్న దృశ్యం కలిగిన వీడియో సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది.

nani4.2.jpg


ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?

ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్‌ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ

ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 27 , 2025 | 12:26 PM