Home » Chevella
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. పలు కారణాలతో రెండు పార్లమెంట్ల పరిధిలో 30 నామినేషన్లను తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు. మల్కాజిగిరి సెగ్మెంట్(Malkajigiri segment)లో అత్యధికంగా 77 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
Telangana: ‘నేను పార్టీ మారడం కేటీఆర్‌కు ఇష్టం లేదు. కవిత అరెస్ట్ అయిన మూడు రోజులకు కేటీఆర్ కూడా స్టేడియం వెళ్లి మ్యాచ్ చూసాడు’’ అని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బుధవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ...అపాయింట్మెంట్ అడిగే లీడర్‌కు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి సుమారు రూ.300 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కానీ ఆయనకు సొంత కారు లేదు. ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం..
Telangana: బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్ర నగర్లో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా బద్వేల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
తాను ప్రజలతోనే ఉంటానని... ప్రజల కోసమే కొట్లాడతానని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy) అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలు అయ్యిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. శనివారం నాడు చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, బీఆర్ఎస్ (BRS) ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేశామని తెలిపారు.
చేవెళ్ల సీటును సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి(MP Ranjith Reddy)కి ఇవ్వాలని కాంగ్రెస్(Congress) పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. మరోవైపు పార్టీలో సీనియర్ నేతలు బీఆర్ఎస్ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేదంర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస షాక్‌ల మీద షాక్‌లు తగుతున్నాయి. వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ను వీడిన కొద్దిగంటల్లోనే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కు అభ్యర్థులు దొరకటం లేదని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత జితేందర్‌రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలసి ఉండవచ్చని తెలిపారు. జితేందర్ రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని తనకు నమ్మకముందని చెప్పారు.