Hyderabad: నాడు టీఆర్‌ఎస్.. నేడు బీజేపీలో.. - ‘కొండా’ను వరించిన విజయం
ABN , Publish Date - Jun 05 , 2024 | 12:19 PM
2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాడు టీఆర్‌ఎస్(TRS) పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy) ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ‘కొండా’కు 4,35,077 ఓట్లు రాగా ప్రత్యర్థి పటోళ్ల కార్తీక్‌రెడ్డిపై 73,023 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్: 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాడు టీఆర్‌ఎస్(TRS) పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy) ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ‘కొండా’కు 4,35,077 ఓట్లు రాగా ప్రత్యర్థి పటోళ్ల కార్తీక్‌రెడ్డిపై 73,023 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి పోటీ చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డిపై పోటీ చేసి 14,317 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. తిరిగి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి(Gaddam Ranjith Reddy)పై ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డికి 6,36509 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డికి 8,09,528 ఓట్లు వచ్చాయి. రంజిత్‌రెడ్డిపై 1,72,897 మెజార్టీ సాధించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మల్కాజిగిరిలో ఎప్పుడూ విభిన్నమైన తీర్పే...
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని బీజేపీ పార్టీకి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడ లేకుండానే బీజేపీ విజయదుందుభి మోగించింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం స్థానం ఏర్పడ్డాక మొదటి సారిగా హస్తం కైవసం చేసుకగా, 2014, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. తొలిసారిగా చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై కమలం వికసించింది. తిరుగు లేని నేతగా నిలిచారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News