Share News

MP Visveshwar Reddy: ఆ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీజేపీ..

ABN , Publish Date - Oct 05 , 2024 | 11:21 AM

మహేశ్వరం నియోజకర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని, భవిష్యత్‌లో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.

MP Visveshwar Reddy: ఆ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీజేపీ..

- చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్: మహేశ్వరం నియోజకర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని, భవిష్యత్‌లో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని నాదర్‌గుల్‌ 8వ డివిజన్‌ అంబేడ్కర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో గురువారం రాత్రి నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్‌, కార్పొరేటర్‌ గూడెపు ఇంద్రసేనతో కలిసి ఆయన ప్రారంభించారు. పలువురితో పార్టీ సభ్యత్వం చేయించి రసీదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం కన్వీనర్‌ దేవేందర్‌రెడ్డి, కౌన్సిల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ తోట శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్లు రామోజీ అమితాశ్రీశైలంచారి, నిమ్మల సునీతాశ్రీకాంత్‌గౌడ్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 200 మంది పోకిరీలకు జైలు శిక్ష..


.......................................................

ఈ వార్తను కూడా చదవండి:

.......................................................

Amrapali: గార్బేజ్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలి..

- ప్రణాళికలు సిద్ధం చేయండి: ఆమ్రపాలి

హైదరాబాద్‌ సిటీ: మహానగరాన్ని గార్బేజ్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి రెండు రోజుల్లో సమర్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) పారిశుధ్య విభాగం అదనపు కమిషనర్‌ రఘుప్రసాద్‌ను ఆదేశించారు. జోనల్‌, అదనపు కమిషనర్లతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మార్కెట్‌ల వద్ద డస్ట్‌బిన్‌లు, వాణిజ్య ప్రాంతాల్లో లిట్టర్‌ బిన్‌లు ఏర్పాటు చేయాలని, జోనల్‌ కమిషనర్లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

city5.jpg


వాటర్‌బోర్డు, జీహెచ్‌ఎంసీ పూర్తిచేసిన పనులకు సంబంధించిన వ్యర్థాలను తొలగించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు జోనల్‌ స్థాయిలో కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్తి పన్ను వసూలుకు వెళ్లినప్పుడు వాణిజ్య ప్రాంతాల వద్ద పారిశుధ్య నిర్వహణను పరిశీలించాలని, జీపీఎస్‌ అమర్చిన స్వచ్ఛ ట్రాలీల పనితీరును ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

ఇదికూడా చదవండి: KBR Park: 7 వంతెనలు.. 7 సొరంగ మార్గాలు

ఇదికూడా చదవండి: Harish Rao,: దసరా తర్వాత ఢిల్లీలో ధర్నా

ఇదికూడా చదవండి: నా కుమారుల ఫామ్‌హౌ్‌సలు ఎక్కడున్నాయో చూపించాలి?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 05 , 2024 | 11:21 AM