Home » Chhattisgarh
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలోకి వచ్చినా అక్కడ టెర్రరిస్టులు, నక్సలైట్లకు ధైర్యం పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్‌గఢ్ లోని సూరజ్‌పూర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజానికి ముకుతాడు వేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నక్సలైట్లు జరిపిన ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) పేలుళ్లలో పోలింగ్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) జవాన్ గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా తెలిపారు.
దేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల ఓటర్లు నేడు ఓటు వేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 60 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ మొదలైంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఛత్తీస్‌గఢ్ లో తొలి విడత పోలింగ్, మిజోరంలో ఒకే విడతలో పోలింగ్ పూర్తిచేయడానికి రంగం సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతగా 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికల హోరుతో పాటు ‘మహాదేవ్ బెట్టింగ్ యాప్’ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు దొరికిన ఒక ‘కొరియర్’తో...
కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన జరిపిస్తామని, గ్యాస్ సిలెండర్లపై రూ.500 సబ్సిడీ ఇస్తామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ హామీ ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆదివారంనాడు ఆయన విడుదల చేశారు.
మహదేవ్ యాప్ స్కామ్‌లో తన ప్రమేయం ఉందంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ తిప్పికొట్టారు. యాప్ ప్రమోటర్ల నుంచి బీజేపీ నేతలు ముడుపులు తీసుకున్నందునే ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎదురుదాడి చేశారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల కోసం శుక్రవారం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తామిచ్చిన హామీలనే వాళ్లు కొట్టారంటూ మండిపడింది. తమ ఎన్నికల హామీల్ని ‘ఉచితాలు’ అని విమర్శించిన బీజేపీ..
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, నవంబర్‌లో రెండు విడతల్లో జరగబోయే ఎన్నికల్లో అఖండ విజయం నమోదు చేస్తుందని పీపుల్ పల్స్ సర్వే...
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ) కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరి హృదయాల్లోనూ ఉందని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ పార్టీ ఉంటుందన్నారు.