Home » Chhattisgarh
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారంనాడు ఒకరోజు పర్యటన జరపనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
ఇండియా-భారత్ వివాదంపై కేంద్రంలని అధికార బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. దేశాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నస్తోందని అన్నారు. భారత్‌ను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.
ఛత్తీస్‌గఢ్‌కు 'ఢిల్లీ కా దర్బార్' చేసిన మంచి ఏదీ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అధికార మార్పు కోసం మాత్రమే కాదని, ఛత్తీస్‌గఢ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిందని అన్నారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుతో చిన్న వ్యాపారాలు ధ్వంసమయ్యాయని, ఇవి ఉద్దేశపూర్వకంగా చేసినవేనని తప్పుపట్టారు.
ఓ ఇంట్లోని గది నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో గమనించిన ఎదురించి వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిచంగా.. అక్కడ ఓ వృద్ధురాలి మృతదేహం బయటపడింది. అయితే ఆమె మరణం వెనుక ఆ ఇంటి కోడలి ప్లాన్ ఉందనే విషయం...
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ జకీయ సలహాదారు వినోద్ వర్మ, రాయపూర్ ఓఎస్డీ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారంనాడు దాడులు జరిపింది. ఈ ఇద్దరి నివాసాలపై ఈడీ బృందాలను దాడులకు పంపడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను ముఖ్యమంత్రి తప్పుపట్టారు.
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీకి గట్టి దెబ్బ తలిగింది. సత్నామి సమాజ్ ఆధ్యాత్మిక గురువు బాల్‌దాస్ సాహెబ్ బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు గురు కుష్వంత్ దాస్ సాహెబ్, సత్నామి సమాజ్‌కు చెందిన గురు అసాంభ్ దాస్ సాహెబ్, గురు ద్వారకా దాస్ సాహెబ్, గురు సౌరభ్ దాస్ సాహెబ్‌లు బీజేపీలో చేరారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సోమవారం మీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుండగా ఓ పాము కలకలం సృష్టించింది. సీఎం కాలిపక్కనుంచి పాము వెళ్తుండగా ఆయన భద్రతా సిబ్బంది సహా అక్కడున్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దానిని కొట్టి చంపేందుకు వారు ప్రయత్నంచగా సీఎం వారించారు.
కాంగ్రెస్ చేసిన పనులను ట్విస్ట్ చేసి తమవిగా చెప్పుకోవడం, ప్రజలను తప్పుదారి పట్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఛత్తీస్‌గఢ్ లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాల్లో ఆదివారంనాడు జరిగిన బహిరంగ ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, దేశానికి అవసరమైన వన్నీ కాంగ్రెస్ ఎప్పుడో చేసిందని అన్నారు.
పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరింది. పిచ్చి ముదిరింది అనే దానికి ఈ అమ్మాయే ప్రత్యక్ష ఉదాహరణ కావొచ్చు. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఓ అమ్మాయి ఏకంగా 80 అడుగులు ఎత్తైన హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కేసింది. దీంతో ఎక్కడ దూకుతుందోననే భయంతో ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా ఆ హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కాల్సి వచ్చింది.