Narendra Modi: ఎన్నికల వేళ రెండు రాష్ట్రాల్లో పీఎం అభివృద్ధి ప్రాజెక్టులు
ABN , First Publish Date - 2023-09-13T15:23:54+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారంనాడు ఒకరోజు పర్యటన జరపనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్ (Chattisgarh), మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గురువారంనాడు ఒకరోజు పర్యటన జరపనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధానమంత్రి మధ్యప్రదేశ్‌లోని బినా సిటీకి చేరుకుని రూ.50,500 కోట్లకు పైగా విలువైన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సహా రాష్ట్రంలో 10 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు రాయగఢ్ (ఛత్తీస్‌గఢ్) చేరుకుని రైల్ సెక్టార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని తొమ్మిది జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్స్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు సుమారు లక్ష సికిల్ సెల్ కౌన్సెలింగ్ కార్డులను పంపిణీ చేస్తారు. 2023 జూలైలో మోదీ ప్రారంభించిన సెకిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ (ఎన్ఎస్ఏఈఎం)లో భాగంగా ఈ కార్డులను పంపిణీ చేస్తారు.