Home » Chhattisgarh
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా హిదూర్ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు వీరమరణం పొందగా, ఒక మావోయిస్టు మృత్యువాత చెందాడు.
ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ, ముంబయి. కోల్‌కతాలలో దాడులు నిర్వహించిన ఈడీ యాప్ ప్రమోటర్‌కి చెందిన రూ.580 కోట్లు స్తంభింపజేసింది.
ఓ ఉపాధ్యాయుడు ఏకంగా ప్రభుత్వ పాఠశాలలోనే మద్యం సేవించాడు. ఆ తర్వాత ఉపాధ్యాయుడు పాఠశాలలో సంభాషిస్తూ రచ్చ సృష్టించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఓ గనిలో అనేక మంది కూలీలు పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా రాతి బండ కూలిపోయి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మరణించగా..మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో చోటుచేసుకుంది.
పలు ప్రాణాంతక దాడుల్లో ప్రమేయమున్న నక్సలైట్ కమాండర్ నగేష్ అలియాస్ పెడకం ఎర్ర (38) సోమవారంనాడు లొంగిపోయాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల సమక్షంలో అతను సరెండర్ అయినట్టు ఎస్పీ కిరణ్ జి.చావన్ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో ఆదివారం చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పర్యటించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి భద్రాద్రి నుంచి భారత్ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించనున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ప్రముఖ వాణిజ్యవేత్తలు వంటివారే కనిపించారని, చూద్దామన్నా ఎక్కడా పేదలు, కార్మికులు, రైతులు కనిపించ లేదని అన్నారు.
మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దంతేవాడ-బిజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామాల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ బృందాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లా టేకులగూడెంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) క్యాంప్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో.. పోలీసులు, మావోల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి.
chhattisgarh: మరోసారి ఎదురుకాల్పులతో ఛత్తీస్‌ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.