Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Encounter: పోలీసులు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు.. ఇద్దరు మృతి, వారిలో

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:50 PM

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా హిదూర్ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు వీరమరణం పొందగా, ఒక మావోయిస్టు మృత్యువాత చెందాడు.

Encounter: పోలీసులు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు.. ఇద్దరు మృతి, వారిలో

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని కాంకేర్(Kanker) జిల్లా హిదూర్ ప్రాంతంలో ఆదివారం పోలీసులు(Police), నక్సలైట్లకు(Maoists) మధ్య ఎన్‌కౌంటర్(firing) జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు వీరమరణం పొందగా, ఒక మావోయిస్టు మృత్యువాత చెందాడు. అత్యంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఛోటేబెథియన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిదూర్ అడవుల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.

ఈ ఎన్‌కౌంటర్‌లో బస్తర్ ఫైటర్స్ బెటాలియన్ కానిస్టేబుల్(constable) రమేష్ కురేటి వీరమరణం పొందాడు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్ మృతదేహంతో పాటు ఏకే 47 ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన హిదూర్‌ అడవుల్లో(forest) గంటకుపైగా ఈ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌ను ఎస్పీ ఐకే అలెసెలా ధృవీకరించారు. పోలీసు సిబ్బంది ఎన్‌కౌంటర్ స్థలాన్ని చుట్టు ముట్టి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారని వెల్లడించారు.


ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ విముక్తం చేసేందుకు భద్రతా బలగాలు నిరంతరంగా చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసుల(police) బృందం ఆదివారం సెర్చ్ ఆపరేషన్ కోసం బయలుదేరింది. ఆ క్రమంలోనే నక్సలైట్లు పోలీసులపై మెరుపుదాడి చేయగా పోలీసు బృందం కూడా ప్రతీకారం తీర్చుకుంది. నక్సలైట్లకు పోలీసు బృందం ధీటుగా సమాధానం ఇచ్చింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Chennai: ప్రేమించకుంటే యాసిడ్‌ పోస్తా.. అంటూ బెదిరిస్తున్నాడు..

Updated Date - Mar 03 , 2024 | 12:50 PM