Encounter: ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోలు మృతి..రివేంజ్ తీర్చుకుంటారా?
ABN , Publish Date - Apr 06 , 2024 | 09:32 AM
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో(telangana chhattisgarh border) శుక్రవారం రాత్రి పోలీసులు(police), మావోయిస్టులకు(Maoists) మధ్య జరిగిన ఎన్‌కౌంటర్(encounter)లో ముగ్గురు మావోలు మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో మూడు తుపాకులు సహా ఇతర సామాగ్రిని గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నాయి.
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో(telangana chhattisgarh border) శుక్రవారం రాత్రి పోలీసులు(police), మావోయిస్టులకు(Maoists) మధ్య జరిగిన ఎన్‌కౌంటర్(encounter)లో ముగ్గురు మావోలు మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో మూడు తుపాకులు సహా ఇతర సామాగ్రిని గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అడవుల్లో(forest) ఉన్నారన్న పక్కా సమాచారం తెలుసుకుని ప్రత్యేక పోలీసు బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ క్రమంలో అప్రమత్తమైన మావోయిస్టులు పోలీసులపై ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పులో(firing) ముగ్గురు మావోలు మరణించారు.
ములుగు జిల్లా(mulugu district) వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రిగుట్టలు-ఛత్తీస్‌గఢ్ పూజారి కాంకేర్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని పోలీసులతోపాటు సరిహాద్దు ప్రాంతాల్లోని సిబ్బందిని కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ముగ్గురు మావోలు మృత్యువాత చెందిన నేపథ్యంలో వారు మళ్లీ ఏదైనా ఎటాక్ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల వేళ మావోలు ఏదైనా మళ్లీ ప్లాన్ చేసి రివేంజ్ తీర్చుకుంటే ఎలా అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
కేసీఆర్ కుటుంబానికి రూ.2లక్షల కోట్ల ఆస్తులున్నాయ్!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..