Home » Chiranjeevi
పద్మవిభూషణ్ అవార్డు రావడంతో మెగాస్టార్ చిరంజీవికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్లో గల చిరంజీవి ఇంటికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లారు. చిరంజీవికి శాలువా కప్పి సత్కరించారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో మోగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జాతీయ జెండాను ఎగురవేశారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డు వరించింది. చిరంజీవి సినీ రంగంలో, వెంకయ్య నాయుడు రాజకీయాల్లో అసమాన సేవలు అందించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు.
హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
పద్మవిభూషణ్ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం యొక్క అండదండలు, నీడలా నడిచే కోట్లాది మంది అభిమానుల ప్రేమ, అభిమానం వల్ల తాను ఈ స్థితిలో ఉన్నానని చెబుతున్నారు.
హైదరాబాద్: పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు తెలిపారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవీలను అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది.
బుధవారం ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో గోల్కొండలో లైట్ అండ్ ఇల్యూమినేషన్ షోని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి & సినీ నటుడు చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.
Andhrapradesh: మెగాస్టార్ చిరంజీవి, ఏపీసీసీ చీఫ్ షర్మిలపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవిని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.