Share News

Chandrababu Swear-in: చంద్రబాబుకి అమిత్ షా.. పవన్‌కి చిరంజీవి ప్రత్యేక అభినందనలు

ABN , Publish Date - Jun 12 , 2024 | 04:49 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా తమ విషెస్‌ను తెలియజేస్తున్నారు.

Chandrababu Swear-in: చంద్రబాబుకి అమిత్ షా.. పవన్‌కి చిరంజీవి ప్రత్యేక అభినందనలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా తమ విషెస్‌ను తెలియజేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రత్యక్షంగా హాజరైన కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ అమిత్ షా సోషల్ మీడియా వేదికగా కూడా చంద్రబాబుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.


‘‘ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు అభినందనలు’’ అని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.


తమ్ముడికి అన్నయ్య ప్రత్యేక అభినందనలు...

ఏపీ కేబినెట్ ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్‌, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని, ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 04:49 PM