Home » CM Chandrababu Naidu
మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా శనివారం ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు.
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్కు వచ్చిన సీఎం చంద్రబాబు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మమేకం అయ్యారు.
ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చి గంజాయి వినియోగాన్ని పూర్తిగా నివారిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల మున్సిపల్ పాఠశాలలో పేరెంట్స్-టీచర్స్ సమావేశం జరిగింది. బాపట్లలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు.పాఠశాల ఆవరణలో విద్యార్థులతో చంద్రబాబు, లోకేష్ మాట్లాడారు.
బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన మెగా పేరంట్ టీచర్ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. పేరంట్స్ తో మాట్లాడిన తర్వాత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ థగ్ ఆఫ్ వార్ ఆడారు. ఆ గేమ్ లో అనూహ్యంగా చంద్రబాబు జట్టు విజయం సాధించింది.
అదానీ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాత్రపై ఏపీ ప్రభుత్వం విచారణ చేయించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ స్కాంపై ఏసీబీతో విచారణ చేయించాలని కోరారు. ఈ స్కాంలో నిజాలు నిగ్గుతేల్చాలని అన్నారు.
మెగా పేరంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా బాపట్లలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విద్యార్థి మీనాక్షి, ఆమె తండ్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
విజయవాడలో ఈ నెల 14న దివంగత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ జరగనుంది. దీనికి ముఖ్య అతిఽథులుగా సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు.
ఏపీని నాలెడ్జ్ హబ్గా మారుస్తున్నామని, విశాఖపట్నం దానికి కేంద్రంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలు చేసే ఎంటర్ప్రెన్యూర్స్ను ప్రోత్సహించడంతోపాటు వారికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా విజయసాయిరెడ్డికి ఆనం చురకలంటించారు.
అన్ని విధాల విశాఖపట్నంను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం మెట్రోకు డీపీఆర్ తయారు చేసి పంపించామని చెప్పారు. రైల్వే జోన్ వస్తోంది. జోన్ భవనాల నిర్మాణ అంశాలు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.