Share News

Anam Venkata Ramana Reddy: విజయసాయిరెడ్డికి చురకలంటించిన ఆనం

ABN , Publish Date - Dec 06 , 2024 | 09:52 PM

సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా విజయసాయిరెడ్డికి ఆనం చురకలంటించారు.

Anam Venkata Ramana Reddy: విజయసాయిరెడ్డికి చురకలంటించిన ఆనం

నెల్లూరు, డిసెంబర్ 06: వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి చురకలంటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని 70 ఏళ్ల ముసలోడని విజయసాయిరెడ్డి అంటున్నారని.. మరి 67 ఏళ్ల వయస్సు వచ్చిన నీవు ఏమైనా కుర్రొడివా అంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీకి చురకలంటించారు. ఓ సీఎంని పట్టుకుని మెంటలోడు అంటావు.. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ.. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొనే వాడు కుర్రోడా? అంటూ పరోక్షంగా వైఎస్ జగన్‌ను విమర్శించారు. నువ్వు చిప్ చిప్ బ్యాచీ కాదా? వైఎస్ జగన్ బెడ్ రూమ్‌లో నుంచి బయటకు రాగానే... చెమ్మ చెక్క కొట్టేది నువ్వు అంటు విజయసాయిరెడ్డిని వ్యంగ్యంగా అన్నారు.

Also Read: విజయవాడ వేదికగా ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల కార్యక్రమం

Also Read: పార్లమెంట్‌లోకి ఎంపీలు.. నగదు తీసుకు వెళ్లేందుకు లిమిట్ ఉందా..?


క్యాస్ట్ బడీస్ అన్నాడు విజయసాయి రెడ్డి.. ఒరేయ్ పొట్టి సాయిరెడ్డి, సారా రెడ్డి.. నువ్వేమైన రెడ్లకు న్యాయం చేశావా? ఈ ఐదేళ్లులో రెడ్లని సంక నాకిచ్చారంటూ విజయసాయిరెడ్డిపై ఆయన మండిపడ్డారు. శుక్రవారం నెల్లూరులో ఆనం వెంకట రమణా రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. వాల్యూయేషన్ అన్నావ్. ప్రపంచంలో ఏ వ్యాల్యూషన్ అయినా తీసుకో... 2,200 ఎకరాలు రూ.12 కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడంటూ విజయసాయిరెడ్డిని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు.

Also Read: రాశి మారుతోన్న సూర్యుడు.. ఈ ఐదు రాశుల వారికి సమస్యలు తప్పవు!

Also Read: ఆ బియ్యం సంగతి తేల్చేందుకు రంగంలోకి స్పెషల్ ఆఫీసర్


ఏపీలో ఎక్కడైనా ఎకరా రూ.29,973కి దొరుకుతుందా? ఏ వాల్యూషన్ వేశావ్ అంటూ ఆనం నిలదీశారు. కాకినాడ పోర్ట్ చైర్మన్ కేవీరావు పారిపోయాడా? అయినా ఆయన పారిపోయాడు కాబట్టే బతికున్నాడు. అదే ఇక్కడే ఉంటే చంపి గుంతలో పాతిపెట్టేవారన్నారు. ఆయన కుమారులు అమెరికన్ సిటిజన్లు.. కాబట్టే 41శాతానికి షేర్ వచ్చి ఆగింది. ముందు దానికి సమాధానం చెప్పు అంటూ విజయసాయిరెడ్డికి ఆనం సూటిగా సవాల్ విసిరారు.

Raiparthy SBI Robbery: రాయపర్తి ఎస్‌బీఐ కేసు ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్

Also Read: హైదరాబాద్‌లో ట్యాబ్లెట్ల బిర్యానీ


అయినా.. తమ నాయకుడిని తిడితే ఏమి వస్తుంది రా...? బొక్కలో వేస్తామని హెచ్చరించారు. నువ్వు తప్పు చేసి ఉంటే నువ్వూ బొక్కలోకి పోతావని ఆ విషయం గుర్తుపెట్టుకో అంటూ విజయసాయిరెడ్డిని ఆనం హెచ్చరించారు. సీఎం చంద్రబాబుని లోపలేస్తావా? వేసి చూడు అంటూ సవాల్ విసిరారు. సీఎంని బెదిరిస్తావా? నీ మాటలతో చంద్రబాబు లైఫ్‌కి త్రెట్ ఉంది. వీళ్లు చేసిన పనుల వల్ల చంద్రబాబుకి ప్రాణహానీ ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: బెల్లం సున్నుండ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


సాయిగాడికి ఈ రోజు తెలియ లేదు కదా...?.. ఇంత తెలిసిన వాడివి అయిదేళ్ల మీ పాలనలో ఏం చేశారు? అని విజయ సాయిరెడ్డిని ఆనం సూటిగా ప్రశ్నించారు. ఒక పక్క పిచ్చోళ్లులాగా మాట్లాడతారు. మరో వైపు తమకు ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదంటారంటూ వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి ఆనం వెంకటరమణా రెడ్డి చరకలంటించారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 09:53 PM