Home » CM Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎంపికైన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘు రామకృష్ణరాజు (ట్రిపుల్ ఆర్)పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయంగా ట్రిపుల్ ఆర్ చిత్రం సంచలనం సృష్టింస్తే.. ఈ లీడర్ ట్రిపుల్ ఆర్ పోలిటికల్‌గా సంచలనం సృష్టించారన్నారు.
రఘురామ ఏదైనా ఫ్రాంక్‌గా మాట్లాడతారని.. ఆయనకు కల్మషం ఉండదు ముందు, వెనుక చూడకుండా మాట్లాడుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎక్కడైనా తప్పులు ఉన్నప్పడు కుండబద్దలు కొట్టినట్లుగా రఘురామ చెబుతారని.. అదే ఆయనకు ఇబ్బందులు తెచ్చిందని రఘురామ గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పారిపోయారంటూ మంత్రి డోలా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉన్న గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ కార్యరూపం దాల్చడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా ఎన్డీయేనే పోషించాలి. ప్రశ్నలు మనమే వేద్దాం.. సమాధానాలూ మనమే చెబుదాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
తమ ప్రభుత్వంలో ప్రతిభతో ఆర్థిక వ్యవహారాలను నిర్వహించామని, తమను పిలిచి అవార్డు ఇవ్వాలని మాజీ సీఎం జగన్ అన్నారు.
సీఎం చంద్రబాబు మంచి విజనరీ ఉన్న నాయకుడని ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ రవిశంకర్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ.. తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
అమరావతికి అందలం.. సంక్షేమానికి జవసత్వాలు.. వివిధ పథకాలకు పూర్వ వైభవం.. పడకేసిన సాగునీటి ప్రాజెక్టులకు పునరుజ్జీవం.. గత వైసీపీ ఐదేళ్లలో పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రతి రంగాన్ని గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ అభివర్ణించింది.