Share News

AP CM Chandrababu Vision : స్వర్ణాంధ్ర 2047

ABN , Publish Date - Dec 14 , 2024 | 03:02 AM

రాష్ట్ర దశ, దిశను మార్చే స్వర్ణాంధ్ర - 2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆరోగ్యం.. సంపద..

AP CM Chandrababu Vision : స్వర్ణాంధ్ర 2047

విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యాలు

  • ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం.. సంపద.. సంతోషం..

  • ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన

  • నదుల అనుసంధా నంతో ఏపీకి నీటి భద్రత

  • పేదరికం సంపూర్ణ నిర్మూలన

  • 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

  • 3 వేల డాలర్లు (రూ.2.54 లక్షలు) ఉన్న తలసరి ఆదాయాన్ని 2047 నాటికి 42 వేల డాలర్లకు (రూ.35.62 లక్షలు) చేర్చ

  • ఆంధ్రాను నం.1గా నిలుపుతాం

  • ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం

  • ఏపీ దిశ, దశ మార్చే విజన్‌ ఆవిష్కరించాం: సీఎం

  • 2047నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

  • ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు

  • జీరో పావర్టీ, నదుల అనుసంధానం.. నాలెడ్జ్‌ సొసైటీ, అభివృద్ధి వికేంద్రీకరణ సాధనకు సంకల్పం

  • భవిష్యత్తులో డేటా గొప్ప సంపద

  • సిలికాన్‌ వ్యాలీ బాటలోనే.. ఆంధ్రా వ్యాలీ

  • రాబోయే కాలంలో సక్సెస్‌ స్టోరీ వినిపిస్తాం

  • విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు

సాధారణంగా అభివృద్ధిని అంకెల్లో కొలుస్తారు. సాధించిన ప్రగతిని సగటుల్లో తూస్తారు. కానీ, అభివృద్ధిని ఆరోగ్యం.. సంతోషం.. సంపదతో బేరీజు వేస్తూ స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్‌ను కూటమి ప్రభుత్వం ఆవిష్కరించింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఏకంగా రాబోయే 23 ఏళ్ల ‘విజన్‌’ను రాష్ట్రానికి అందించింది.

అమరావతి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర దశ, దిశను మార్చే స్వర్ణాంధ్ర - 2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆరోగ్యం.. సంపద.. సంతోషాలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న విజన్‌ పత్రాన్ని శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తెలుగుజాతిని నంబర్‌ 1గా, దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలిపే కృషికి ఈ రోజు బీజం పడిందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజల తలరాతను, భావితరాల భవిష్యత్తును విజన్‌ డాక్యుమెంట్‌ మార్చి తీరుతుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

Untitled-2 copy.jpg


‘‘పది సూత్రాలతో విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన చేశాం. జీరో పావర్టీ (పేదరిక సంపూర్ణ నిర్మూలన) కోసం ఎన్టీఆర్‌ కలలు గనేవారు. పీపుల్‌, పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షి్‌ప(పీ4)అనే విధానం ద్వారా నిరుపేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తాం. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనేది నా సంకల్పం. 2047 నాటికి ఇది తప్పక నెరవేరుతుంది. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. ఇందుకు పాలసీలు తెస్తున్నాం. మంచి పరిశ్రమలు, ఎంఎ్‌సఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. జనాభా నిర్వహణపై దృష్టి సారించాం. రాష్ట్రంలో నాలెడ్జి సొసైటీని తయారుచేసుకోవాల్సిన అవసరముంది. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందేలా అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను చేపడతాం’’ అని చంద్రబాబు అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

  • ఇన్ని ఇబ్బందులు గతంలో పడలేదు

‘‘నేను 1978 నుంచి అనేక ఎన్నికల్లో పోటీ చేశాను. కానీ, 2024 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. 93 సక్సెస్‌ రేట్‌తో 53 శాతం ఓట్లు పడటం నా జీవితంలో ఇదే మొదటిసారి. ప్రజల్లో వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయబోమని నాడు స్పష్టం చేశారు. కలిసి ఉంటేనే బలం ఉంటుందని చెప్పి.. రాష్ట్రంలో కూటమిని ఆయన ముందుకు నడిపించారు. ‘నాకేం వస్తుంద’ని ఆలోచించకుండా రాష్ట్రానికి జరిగే మేలును మాత్రమే ఆయన వాంఛించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే నరేంద్రమోదీ, పవన్‌ కల్యాణ్‌, నేను కలిసి పోటీ చేశాం. నాడు మేం ఊహించిన దాని కంటే అధికంగా జగన్‌ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. అన్ని శాఖలను సమీక్షించాం. గాడి తప్పిన పాలన గాడిలో పెట్టాం. ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాం. ఇన్ని ఇబ్బందులు గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఆరు నెలల్లో విజన్‌ 2047 డాక్యుమెంట్‌ తెచ్చామంటే అదే మనకున్న విజన్‌. 2047లో వందేళ్ల స్వాతంత్య్రదినోత్సవం జరుపుకోబోతున్నాం. కేంద్రంలో ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంతో ముందుకెళ్తుండగా, మనం స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ తయారుచేశాం’’


  • ఆ రాళ్లలో సింగపూర్‌, దుబాయ్‌ను చూశా..

‘‘రాష్ట్రంలో తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువగా ఉంది. 2047 నాటికి దానిని 42 వేల డాలర్లకు చేర్చడమే విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యం. ‘హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా తాము రాళ్లు మాత్రమే చూశామని.. మీరు మాత్రం ఒక విజన్‌ చూశారని పవన్‌కల్యాణ్‌ ఎప్పుడూ అంటుంటారు’ ఆ రోజు నేను అక్కడ ఒక సింగపూర్‌ను, దుబాయ్‌ను చూశాను. న్యూయార్క్‌ లాంటి నగరాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదనే ఆలోచన చేసి ముందుకెళ్లాను. దాని ఫలితంగానే హైదరాబాద్‌ దేశంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా సంపాదించే నగరాల్లో ఒకటిగా నిలిచింది. దీనికోసం 1997లో 14 టాస్క్‌ఫోర్స్‌లు వేశాం. ఈ క్రమంలోనే విజన్‌-2020ను 1999 జనవరి 26న రిపబ్లిక్‌ డే రోజున ఆవిష్కరించాం. దాని ఫలితాలను ఈ రోజు చూస్తు న్నాం. ఇదే విధంగా స్వర్ణాంధ్ర-2047 విజన్‌ కూడా సాకారమవుతుంది. విజన్‌ డాక్యుమెంట్‌ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో చెప్పాలంటూ పిలుపునిస్తే ఏకంగా 17 లక్షల మంది ఆన్‌లైన్‌లో తమ అభిప్రాయాలు తెలియజేశారు. 4.50 లక్షల మంది పాఠశాల విద్యార్థులు, 38 వేల మంది కళాశాల విద్యార్థులు విజన్‌పై నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. ఆ విద్యార్థులతోపాటు పారిశ్రామికవేత్తలు, నీతీఆయోగ్‌, ఇంకా పలు సంస్థల సభ్యుల ఆలోచనలను క్రోడీకరించి విజన్‌ డాక్యుమెంట్‌ను తయారుచేశాం’’


  • తెలుగుజాతి సత్తాకు గుకేశ్‌ ప్రతీక

‘‘1995లో తొలిసారి సీఎం అయిన సమయంలోనే సంస్కరణల అవసరాన్ని గుర్తించాను. అప్పట్లో కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. దేశ భవిష్యత్తును మార్చేశక్తి పబ్లిక్‌ పాలసీకి ఉంటుంది. ఆనాడు ఐటీని ప్రోత్సహించడం ద్వారా నేడు అమెరికాతోపాటు అన్ని దేశాల్లో అత్యధిక తలసరి ఆదాయా న్ని తెలుగుబిడ్డలు సంపాదిస్తున్నారు. ఇండియన్స్‌ ఇప్పటికే గ్లోబల్‌ లీడర్స్‌ అయ్యారు. వారు గ్లోబల్‌ సిటిజన్స్‌ కూడా అయ్యే పరిస్థితికి వచ్చారు. 18 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్‌ అతి చిన్న వయస్సులోనే ప్రపం చ చెస్‌ చాంపియన్‌ కావడం తెలుగుజాతి సత్తాకు ప్రతీక.’’

  • నదుల అనుసంధానంతో..

‘‘టీడీపీ కృషి వల్ల నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది భగవంతుడు కరుణించడంతో అన్ని రిజర్వాయర్లలో దాదాపు 750 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. పట్టిసీమ తరహాలో నదుల అనుసంధానం వల్ల కరువు అనే మా టే తలెత్తదు. గోదావరి నుంచి పెన్నా వరకు నీళ్లు తీసుకెళ్లే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గోదావరి, వంశధార అనుసంధానంపైనా ఆలోచిస్తు న్నాం. అది జరిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉండ దు. దక్షిణ దేశంలోనే మనం నంబర్‌వన్‌ రాష్ట్రంగా ఉంటాం. అందుకే నీటి భద్రతకు విజన్‌లో ప్రాధాన్యం కల్పిం చాం. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని సంకల్పిం చాం. రైతును రాజు చేయాలనేది ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం. పంట ఉత్పత్తులకు విలువను జోడిస్తే రైతుకు మెరుగైన ఆదాయం వస్తుంది. అగ్రిటెక్‌ విధానాలతో రైతులకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాం. ఏపీని గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సంకల్పించాం. ఇందులో భాగంగా అన్ని వాహనాలను ఈవీ వాహనాలుగా తయారుచేయాలని చూస్తున్నాం. కరెంటు చార్జీల విషయంలో ఉత్తమ విధానాలను(ఆప్టిమైజేషన్‌) తీసుకురావాలని చూస్తున్నాం. గతేడాది రూ.5.19 ఉన్న ప్రొక్యూర్‌మెంట్‌ సగటు వ్యయాన్ని ఈ ఏడాది రూ.4.80లకు తగ్గించాం.’’


  • స్వచ్ఛాంధ్ర మన జీవితంలో భాగం కావాలి..

‘‘వ్యవసాయం, పారిశ్రామికం, సేవారంగం, టెక్‌...ఇలా దేని కి సంబంధించిన ఉత్పత్తి అయినా ప్రపంచ మార్కెట్లో పోటీ పడేలా ముందుకెళ్తున్నాం. స్వచ్ఛాంధ్ర మన జీవితంలో భాగం కావాలి. స్వచ్ఛమైన ఆలోచనలూ ముఖ్యమే. ఆలోచనలు కలుషితమైతే వాతావరణం కూడా కలుషితమవుతుం ది. టెక్నాలజీని ఉపయోగించుకుని పనిచేయగలిగితే మన ఉత్పాదకత పెరుగుతుంది. సంపద సృష్టి జరుగుతుంది. విజన్‌ డాక్యుమెంట్‌తో పాటు 20 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. జాబ్‌ ఫస్ట్‌ విధానంతో ఇండస్ట్రీయల్‌ డెవల్‌పమెంట్‌ పాలసీ, ఎంఎ్‌సఎంఈ పాలసీ, పుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలకా్ట్రనిక్‌, ప్రైవేట్‌ పార్క్‌, సెమీకండక్టర్‌, క్లీన్‌ ఎనర్జీ, డ్రోన్‌, డేటా సెంటర్‌, స్పోర్ట్స్‌, టూరిజం తదితర పాలసీలను తీసుకొచ్చాం’’

  • అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం...

‘‘పర్యాటకానికి కొత్త ఊపు తీసుకువస్తున్నాం. రాబోయే రోజుల్లో కనీసం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యం. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు పెడుతున్నాం. వాటివల్ల ఐదులక్షల మందికి ఉపా ధి లభిస్తుంది. అమరావతికి 33 వేల ఎకరాల భూమి ఇచ్చిన ఘనత రైతులదే. వారిపై కేసులను రద్దుచేసి రైతులను అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఎక్కడైనా పరిశ్రమలొస్తే రైతులను కూడా భాగస్వాములను చేస్తాం.’’


  • ‘విజన్‌’ విశిష్టతలివీ...

  1. విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, నీతీఆయోగ్‌, ఇంకా ఇతర సంస్థల ప్రతినిధులు.. ఇలా మొత్తం 17 లక్షలమందిని భాగస్వాములను చేశారు.

  2. అవగాహన కోసం 4.50 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు, 38 వేలమంది కళాశాల విద్యార్థులకు విజన్‌పై పోటీలు నిర్వహించారు.

  3. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం మహా కసరత్తు చేసి తయారుచేసిన పత్రం ఇది

  4. జాబ్‌ ఫస్ట్‌ విధానంతో ఇండస్ట్రీయల్‌ డెవల్‌పమెంట్‌ పాలసీ, ఎంఎ్‌సఎంఈ, పుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలకా్ట్రనిక్‌, ప్రైవేట్‌ పార్క్‌లు, సెమీకండక్టర్‌, క్లీన్‌ ఎనర్జీ, డ్రోన్‌, డేటా సెంటర్‌, స్పోర్ట్స్‌, టూరిజం తదితర 20 పాలసీల సమాహారం..

  5. ఇప్పటికి రెండు విజన్‌ డాక్యుమెంట్లు రాష్ట్రం కోసం తయారయ్యాయి. అందులో ఒకటి విజన్‌-2020. మరొకటి విజన్‌- 2047. ఈ రెండు డాక్యుమెంట్లూ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకంలోనే సిద్ధం కావడం విశేషం.

  • స్వర్ణాంధ్ర-2047లో భాగస్వాములు కండి...

‘‘2047 నాటికి 2.4 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల రాష్ట్ర జాతీయ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దీనివల్ల తలసరి ఆదాయం 42 వేల అమెరికన్‌ డాలర్లకు చేరుతుంది. విజన్‌ ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలి. ఇప్పటి వరకు అందరం సిలికాన్‌ వ్యాలీ గురించి మాట్లాడాం. రేపటి నుంచి ఆంధ్రా వ్యాలీ ఓ సక్సెస్‌ స్టోరీ అవుతుంది. ఇచ్చాపురం నుంచి మంత్రాలయంవరకు ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించాం. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సుస్థిర ప్రభుత్వం ఉండాలి’’ అని చంద్రబాబు వివరించారు.

Updated Date - Dec 14 , 2024 | 03:04 AM