Farmers: రైతులకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే తప్పదు నష్టం..
ABN , Publish Date - Dec 13 , 2024 | 10:12 AM
వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల మామిడి, కొబ్బరి పంటను సాగు చేసే రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులను గమినించిన ప్రభుత్వం రెండు పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది.
ఏలూరు, డిసెంబరు 13: వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల మామిడి, కొబ్బరి పంటను సాగు చేసే రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులను గమినించిన ప్రభుత్వం రెండు పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. ముఖ్యంగా మామిడి రైతులను ఆదుకోవడానికి ఆ పంటకు మొదటిసారిగా బీమా కల్పిస్తున్నారు. జిల్లాలో 35 వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుండగా, 36 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. పంటల బీమా పొందడానికి ఖచ్చితంగా రైతులు తమ పంటను ఈ పంటలో నమోదు చేసుకోవాలి.
మామిడి పంటకు బీమా ఇలా..
మామిడి పంటకు ఎకరానికి రూ.45 వేల వరకు నష్ట పరిహారం పొందవచ్చు. ఎకరానికి రూ.2,250 ప్రీమియం ఈనెల 15వ తేదీలోగా చెల్లించాలి. బీమా పొందడానికి మీ దగ్గరలో ఉన్న బ్యాంకు/ సీఎస్సీ/ లేదా రైతులే నేరుగా పీఎంఎల్డీపై పోర్టల్లో మొబైల్ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. బ్యాంకు అక్కౌంట్ జిరాక్స్, పాస్‌బుక్ జిరాక్స్, పంట వేసినట్టు ధ్రువీకరణ పత్రాలను వీఏఏ/ వీహెచ్ఎ/ వీఎన్ఏలకు ఇవ్వాలి. బీమా వర్తింపులో 15/12/2004 నుంచి 28/2/2025 వరకు ఆకాల/అధిక వర్షపాతం, 1/1/2025 నుంచి 15/3/2025 వరకు చీడపీడల వాతావరణం, ఉష్ణోగ్రతలలో వ్యత్యాసం, 1/3/2025 నుంచి 31/5/2025 వరకు అధిక గాలి అంశాలకు బీమా వర్తింపజేస్తారు.
నష్ట పరిహారం అంచనా..
15/12/2024 నుంచి 31/5/2025 మధ్యన ఆధిక వర్షపాతం, గాలిలో తేమ శాతం, వాతా వరణం వ్యత్యాసం, గాలి వేగం సంబంధించిన పరిణామాలను మండల స్థాయిలో గల ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెలవప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వాతావరణ పరికరాల సాయంతో లెక్కిస్తారు. దానిని ఈ పథకంలో ముందుగా పొందుపరచబడిన పరిణామాలలో సరిపోల్చి నప్పుడు వచ్చిన తేడా ఆధారంగా నష్టపరిహారం చెల్లిస్తారని జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎస్.రామ్మోహన్ తెలిపారు.
కొబ్బరి పంటకు ఇలా..
కొబ్బరి తోటలు సాగు చేసిన రైతులు వాతా వరణ పరిస్థితులు వల్ల, చీడపీడలు వల్ల నష్టపోతే నష్ట పరిహారం పొందే అవకాశాలున్నాయి. కొబ్బరి సాగులో సంకర జాతి మొక్కలు 4 నుంచి 60 ఏళ్లు, పొడవు మొక్కలు 7 నుంచి 60 ఏళ్లు కలిగి ఉండాలి. రైతులు నష్టపరిహారం పొందడానికి ప్రీమియం సంవత్సరానికి చెట్టు ఒక్కింటికి (4 నుంచి 15 ఏళ్లు) రూ.225, 16, నుంచి 60 ఏళ్లు చెట్టుకు రూ.3.50 చెల్లించాలి. ఒకవేళ నష్టం కలిగితే 4 నుంచి 15 ఏళ్ల కొబ్బరి మొక్కలకు ఒక్కింటికి రూ.900, 16 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన మొక్కలకు ఒక్కింటికి రూ.1750 చొప్పున నష్టపరిహారం చెల్లిస్తుంది. సమాచారం కోసం ఏఐసీ రీజినల్ కార్యాలయం 8632233565 నంబర్ను సంప్రదించాలని జిల్లా ఉద్యాన శాఖాధికారి తెలిపారు.
Also Read:
వామ్మో.. గోల్డ్ రేట్ ఇంత పెరిగిందేంటి
భూదాన్ భూముల స్కామ్: బీఆర్ఎస్ కీలక నేతకు..
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. త్రిముఖ వ్యూహం!
For More Andhra Pradesh News and Telugu News..