Home » CM Jagan
ఏపీలో తెలుగుదేశం పార్టీ - జనసేన- బీజేపీ కూటమి 145 సీట్లు సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) జోస్యం చెప్పారు. జగన్ వై నాట్ 175 అన్నాడు..అలాంటప్పుడు ఇతరులను వేరే చోటు నుంచి ఎందుకు పోటీకి నిలబెట్టారని ప్రశ్నించారు. పొత్తు వల్ల టీడీపీకి కొంత నష్టం జరిగిందని అన్నారు.
ఏపీలో ఈ ఎన్నికల్లో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధి, ఏపీ వికాసమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని మండిపడ్డారు. పేదలు ఎవ్వరూ అభివృద్ధి కాలేదని, మాఫియా నేతలు మాత్రం అభివృద్ధి అయ్యారని విమర్శించారు.
Andhrapradesh: నగరంలోని భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనులు లేక పస్తులు ఉన్న పరిస్థితి వివరిస్తూ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. సీఎంగా జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల వేళ ఎవరి నినాదాలు వారివి.. ఏపార్టీ వ్యూహాలు వారివి. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివి.. కానీ ఆ రెండు పార్టీల విషయంలో మాత్రం అంతా రివర్స్ అనే ప్రచారం జరగుుతోంది. ఇద్దరి నినాదం ఒకటే.. ఇద్దరి వ్యూహాలు ఒకటే.. నీకోసం నేను.. నా కోసం నువ్వు అంటూ కలిసిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నీకు నేను, నాకు నువ్వు అనుకుంటూ అడుగులు వేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది.
Andhrapradesh: స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గాజువాకలో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్కు ఓటు వేస్తే... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని.. కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే... ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అప్పు తెచ్చి సంపదను తన వద్దే కేంద్రీకృతం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే సంపద సృష్టించొచ్చని అభిప్రాయపడ్డారు.
విశాఖ: తూర్పు నియోజకవర్గం ప్రజలకు తాను ఎంతో చేశానని కూటమి అభ్యర్థి, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. తాను చేయగలిగినంత సహాయం చేస్తానని.. మాటలతో మోసం చేయడం తెలియదని అన్నారు. గతంలో ఎలా ఉన్నా.. రేపు కూడా అలానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
Andhrapradesh: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో ఇంకా అయోమయం నెలకొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ ఇక్కడ అంటూ ఓటు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్‌పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే అని తెలిపారు.
Andhrapradesh: భీమిలి నియోజకవర్గం మేనిఫెస్టోను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎట్టి పరిస్థితిలో మళ్లీ అధికారంలోకి రాకూడదని కూటమి పనిచేస్తుందన్నారు. వైసీపీ ఇంటికి పంపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. జూన్ 4న జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని అన్నారు.
Andhrapradesh: ప్రధాని మోదీ విజయవాడ వస్తున్నాడంటే ప్రజలు ఎదురు చూడాలని.. కాని విజయవాడ వాసులు మోదీ వస్తున్నారంటే నిరాశక్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మీట్ దిప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ ఏపీ ప్రయోజనాల కోసం ఏం మాట్లాడలేదని.. దీంతో రాష్ట్ర ప్రజలంతా మోదీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారన్నారు.