AP Elections: జూన్ 4న సీఎం పదవికి జగన్ రాజీనామా చేయడం ఖాయం: గంటా
ABN , Publish Date - May 08 , 2024 | 01:17 PM
Andhrapradesh: భీమిలి నియోజకవర్గం మేనిఫెస్టోను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎట్టి పరిస్థితిలో మళ్లీ అధికారంలోకి రాకూడదని కూటమి పనిచేస్తుందన్నారు. వైసీపీ ఇంటికి పంపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. జూన్ 4న జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని అన్నారు.
విశాఖపట్నం, మే 8: భీమిలి నియోజకవర్గం మేనిఫెస్టోను (Bhimili Constituency Manifesto) మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former minister Ganta srinivasrao) బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ (YSRCP) ఎట్టి పరిస్థితిలో మళ్లీ అధికారంలోకి రాకూడదని కూటమి పనిచేస్తుందన్నారు. వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. జూన్ 4న జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని అన్నారు. వైసీపీ పార్టీ మానిఫెస్టోలో దేనికి పొంతన లేదని... పాత మేనిఫెస్టోని కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఇప్పుడు తాము పొత్తు పెట్టుకున్నామని వివరించారు.
AP Elections: ఓటమిని ముందే ఒప్పుకున్న జగన్: వర్ల రామయ్య
గత ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి, నవరత్నాల అమలు చేస్తామని మోసం చేశారన్నారు. జగన్ నిక్కర్లు వేసుకోక ముందు నుంచి రాష్ట్రంలో టీడీపీ సంక్షేమం చేస్తోందన్నారు. భీమిలి అభివృద్ధి... ప్రత్యేక ప్రణాళికలు, సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హౌసింగ్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈసీని మోదీ మేనేజ్ చేస్తున్నారని అంటూ చెబుతున్న మాట.. బొత్స మాటనా?... లేక పార్టీ మాటనా? చెప్పాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Lok Sabha Elections: జైలు నుంచే కేజ్రీవాల్ ఎన్నికల వ్యూహాలు..
టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సూపర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
Read Latest AP News And Telugu News