AP Elections: ఓటమిని ముందే ఒప్పుకున్న జగన్: వర్ల రామయ్య
ABN , Publish Date - May 08 , 2024 | 12:48 PM
Andhrapradesh: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో ఇంకా అయోమయం నెలకొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ ఇక్కడ అంటూ ఓటు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్‌పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే అని తెలిపారు.
అమరావతి, మే 8: పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) ఓటింగ్‌లో ఇంకా అయోమయం నెలకొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ ఇక్కడ అంటూ ఓటు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్‌పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే అని తెలిపారు. ప్రధాని రాక నేపథ్యంలో చాలా మంది అధికారులు ఆ డ్యూటీలో పాల్గొంటున్నందున వారికి రేపు, ఎల్లుండి ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు.
CM Revanth: రేవంత్ చేతులకు గోర్లతో రక్కిన గాయాలు.. అసలేమైంది..?
బయట రాష్ట్రాల్లో విధుల్లో ఉన్న ఏపీ పోలీసులు (AP Police) వారి ఓటు వినియోగించుకునేందుకు పిలిపించాలని.. అలా కుదరని పక్షంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని తెలిపారు. పోలీసు నోడల్ ఆఫీసర్ ఎవరో స్పష్టంగా తెలియపరచాలన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే హోంగార్డుల జీవన ప్రమాణాలు పెంచే దిశలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీలో పాలనలో చాలా మంది పోలీసులు మానసిక క్షోభ అనుభవించారని... రేపు తాము అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితులు ఉండవన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే గౌరవ ప్రధంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉంటుందని చెప్పుకొచ్చారు. డీజీపీ మారడంతో జగన్ నోట ఓటమి మాట వస్తోందని.. ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమిని జగన్ రెడ్డి ముందే ఒప్పుకున్నారంటూ వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
YSRCP: చంద్రగిరిలో వైసీపీకి భారీ షాక్
Lok Sabha Elections: రాహుల్‌కు అగ్ని పరీక్ష.. ఆ ప్రశ్నకు నో ఆన్సర్..!
Read Latest AP News And Telugu News