AP Elections: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తెచ్చింది బీజేపీనే: సీపీఎం శ్రీనివాసరావు
ABN , Publish Date - May 08 , 2024 | 12:08 PM
Andhrapradesh: ప్రధాని మోదీ విజయవాడ వస్తున్నాడంటే ప్రజలు ఎదురు చూడాలని.. కాని విజయవాడ వాసులు మోదీ వస్తున్నారంటే నిరాశక్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మీట్ దిప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ ఏపీ ప్రయోజనాల కోసం ఏం మాట్లాడలేదని.. దీంతో రాష్ట్ర ప్రజలంతా మోదీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారన్నారు.
విజయవాడ, మే 8: ప్రధాని మోదీ (PM Modi) విజయవాడ వస్తున్నాడంటే ప్రజలు ఎదురు చూడాలని.. కానీ విజయవాడ వాసులు మోదీ వస్తున్నారంటే నిరాశక్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు (CPM Leader Srinivasrao) అన్నారు. బుధవారం మీట్ దిప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ ఏపీ ప్రయోజనాల కోసం ఏం మాట్లాడలేదని.. దీంతో రాష్ట్ర ప్రజలంతా మోదీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను మొదట వ్యతిరేకించింది సీపీఎంనే అని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను బీజేపీ చెబితేనే ఇక్కడ వైసీపీ చేసిందన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఏపీ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు.
Congress: రేవంత్ బీజేపీలో చేరతారా.. సీఎం ఏమన్నారంటే
పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) వ్యాఖ్యలు రెండు నాల్కల ధోరణి ల ఉన్నాయని విమర్శించారు. వైసీపీ, టీడీపీ పార్టీలకు నేతలు ఒక పార్టీలో సీటు రాకుంటే మరో పార్టీకెళ్లి సీటు తెచ్చేసుకుంటున్నారంటే దోచుకోవడానికే కదా అని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల విషయంలో గతంలో చంద్రబాబే వ్యతిరేకించి పగులకొట్టించారని గుర్తుచేశారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఉంటాయి కాని పెంచమని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్‌కు చంద్రబాబుకు పెద్ద తేడా లేదంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మద్యం నిషేధించకుండా నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. వామపక్షాలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీపైన ఏపీ ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. బీజేపీతో కలిసిన పార్టీలపైన ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. కమ్యూనిష్టులకు మంచి రోజులు రాబోతున్నాయని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
PM Modi: వసూళ్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను మించిపోయిన ఆర్ఆర్ ట్యాక్స్..
PM Modi: ఇండియా కూటమి ఫ్యూజ్ పోయింది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే: మోదీ
Read Latest AP News And Telugu News