Home » CM Jagan
Andhrapradesh: చీఫ్ సెక్రటరీ ఎన్నికల విధుల్లో పని చేయకుండా జగన్ కొరకు పని చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులు బలవుతున్నారని మండిపడ్డారు. మచిలీపట్నంలో జగన్ కొత్త నినాదం ఎంచుకున్నారని.. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేలా నమ్మకం కనిపించడం లేదని అంటున్నారన్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి మరోసారి లేఖ రాశారు. నవ సందేహాలు పేరులో షర్మిల ఇప్పటికే రెండు సార్లు సీఎంకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారంటూ మొదటి సారి, మద్యం నిషేధంపై రెండో సారి లేఖ రాసిన షర్మిల..
ఏపీలో అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప నుంచి మనుషులను పంపారని కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప (Chinarajappa) మండిపడ్డారు. పెద్దాపురం మండలం అనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ (YSRCP)కి భారీ షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ముఖ్య అనుచరులు విజయవాడలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాపు, బలిజ, ఒంటరి సంఘాల నేతలు హాజరయ్యారు.జగన్‌కు వ్యతిరేకంగా, ఎన్డీఏకు మద్దతుగా పని చేయాలని తీర్మానం చేసుకున్నట్లు సమాచారం.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ (YSRCP) ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు తెరదీసింది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలపై విషం చిమ్మెందుకు ప్రయత్నిస్తోంది.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. 160 అసెంబ్లీ, 25 లోక్‌సభ, సీట్లలో కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని హెచ్చరించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రచారంలో భాగంగా ఈరోజు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి, అనకాపల్లిలో సభల్లో పాల్గొని మోదీ ప్రసంగించారు. ఈ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ వేదికల్లో అధికార వైసీపీ, సీఎం జగన్ రెడ్డిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్, మే 05: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్(AP CM YS Jagan) పరువు తీసేశారు తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నాయకురాలు రేణుక చౌదరి(Renuka Chowdhury). జగన్ పరిపాలనా విధానాలపై(AP Capitals) సెటైర్లు గుప్పించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి..
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని సీపీఐ ముఖ్యనేత నారాయణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడంతో వెనక ఉద్దేశం అదేనని వివరించారు. రూ.వంద కోట్ల స్కామ్ ఆరోపణలు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. రూ.2 వేల కోట్ల స్కామ్ ఆరోపణలు ఉన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన నేత, స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మార్పు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మార్పు కోసం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, నెల్లూరు ప్రకాశంలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అభిప్రాయ పడ్డారు.