AP Elections: ‘నవ సందేహాలు’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈసారి దేనిగురించంటే?
ABN , Publish Date - May 07 , 2024 | 10:00 AM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి మరోసారి లేఖ రాశారు. నవ సందేహాలు పేరులో షర్మిల ఇప్పటికే రెండు సార్లు సీఎంకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారంటూ మొదటి సారి, మద్యం నిషేధంపై రెండో సారి లేఖ రాసిన షర్మిల..
విజయవాడ, మే 7: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి (CM Jagan mohan Reddy) ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) మరోసారి లేఖ రాశారు. నవ సందేహాలు పేరులో షర్మిల ఇప్పటికే రెండు సార్లు సీఎంకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారంటూ మొదటి సారి, మద్యం నిషేధంపై రెండో సారి లేఖ రాసిన షర్మిల.. తాజాగా రాష్ట్ర అభివృద్ధిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ మూడోసారి లేఖ రాశారు.
Nellore City: నెల్లూరు సిటీలో ఎవరు గెలవబోతున్నారు..?
జగన్‌కు షర్మిల సంధించిన ‘‘నవ సందేహాలు’’ ఇవే..
1) స్మార్ట్ సిటి,హెరిటేజ్ సిటీగా కేంద్రం గుర్తించిన రాజధాని అమరావతిని మూడు రాజధానుల వాదన తో ఎందుకు విద్వంసం చేశారు? పోనీ... విశాఖలో అయినా ఎందుకు మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదు? కర్నూల్ లో ఏం నిర్మాణాలు జరిపారు?
2) రాష్ట్ర విభజన నాడు రెవెన్యూ రాబడులు తెలంగాణకు రూ.51 వేల కోట్లు, ఏపీకి రూ.65 వేల కోట్లు ఉంటే... తెలంగాణ రాబడులు రూ.1.59 లక్షల కోట్లకు పెరిగాయి... ఏపీ రూ.1.58లక్షల కోట్ల మధ్య ఉన్న వాస్తవాన్ని కాదనగలరా ?
3) రాష్ట్రంలో 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన ఎందుకు చేయలేదు ?
4) ఐటీ రంగాన్ని పూర్తిగా ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రూ.1.81 లక్షల కోట్లు సాధిస్తే ... ఏపీ కేవలం రూ.962 కోట్లా?
5) విశాఖ రైల్వే జోన్ ప్రకటన జరిగినా...అమలు కాలేదు అంటే మీరు భూ కేటాయింపు చేయలేదు.. దీనికి నైతిక భాధ్యత మీది కాదా?
6) పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం కక్ష్య, నిర్లక్ష్యంతో వదిలేసిన మాట వాస్తవం కాదా ?
7) కనిగిరి, ఏర్పేడు లో నిమ్జ్ అనుమతులు వస్తె...25 వేల ఎకరాల భూ కేటాయింపులు జరపని మాట వాస్తవం కాదా ?
8) విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ ను ఎందుకు నిర్లక్ష్యం చేశారు?
9) వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేకంగా మీరు ఏం చేశారు ? కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు సాధించలేక పోయారు ?
ఇవి కూడా చదవండి...
AP Elections: సీఎస్‌కు ఈసీ ఊహించని ఝలక్.. రంగు పడింది!!
BRS: వరంగల్ బీఆర్ఎస్‌లో పార్టీ ఫండ్ రగడ
Read Latest AP News And Telugu News