Share News

CPI Narayana: జగన్‌ను జైలులో ఎందుకు వేయలే: సీపీఐ నారాయణ విసుర్లు

ABN , Publish Date - May 06 , 2024 | 04:07 PM

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని సీపీఐ ముఖ్యనేత నారాయణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడంతో వెనక ఉద్దేశం అదేనని వివరించారు. రూ.వంద కోట్ల స్కామ్ ఆరోపణలు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. రూ.2 వేల కోట్ల స్కామ్ ఆరోపణలు ఉన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు.

CPI Narayana: జగన్‌ను జైలులో ఎందుకు వేయలే: సీపీఐ నారాయణ విసుర్లు
cpi narayana

కరీంనగర్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని సీపీఐ ముఖ్యనేత నారాయణ (cpi narayana) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడంతో వెనక ఉద్దేశం అదేనని వివరించారు. రూ.వంద కోట్ల స్కామ్ ఆరోపణలు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. రూ.2 వేల కోట్ల స్కామ్ ఆరోపణలు ఉన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు. రూ.45 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన ఏపీ సీఎం జగన్ కనిపించడం లేదా అని అడిగారు. జగన్‌కు ఎందుకు మినహాయింపు ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు.


ఏపీ సీఎం జగన్ మీద 11 క్రిమినల్ కేసులు ఉన్నాయని సీపీఐ నారాయణ వివరించారు. ప్రశ్నిస్తే జైలులో వేస్తారా అని అడిగారు. గత పదేళ్ల నుంచి జగన్‌ బెయిల్ మీద తిరుగుతున్నారని గుర్తుచేశారు. జగన్ మీ దత్త పుత్రుడా అని ప్రధాని మోదీని నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకు ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చారని సీపీఐ నారాయణ వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని కోరారు. ఒకవేళ రేవంత్ రెడ్డి అరెస్ట్ జరిగితే ప్రధాని మోదీ పని అయిపోతుందని సంచలన ఆరోపణలు చేశారు.



Read Latest
AP News And Telugu news

Updated Date - May 06 , 2024 | 04:28 PM