Home » CM Jagan
సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మండిపడ్డారు. ఏపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందని అన్నారు. ఏపీ ప్రగతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీవీ నరసింహరావుకి సైతం భారతరత్న ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు.
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్‌పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్లు కొందరైతే.. విశ్వసించని వారు మరికొందరు.. అయితే ఎన్నికల వేళ మాత్రం రాజకీయ నాయకులు ఎక్కువుగా నమ్మేది వాస్తు శాస్త్రమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టగా.. ఏపీ సీఎం జగన్ సైతం తాడేపల్లిలోని తన నివాసంలో వాస్తు మార్పులు చేయించినట్లు తెలుస్తోంది. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండకపోవడానికి కారణం వాస్తు సమస్యేనంటూ కొందరు పండితులు చెప్పడంతో ఈ ఇద్దరు వాస్తులో మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
విజయవాడ: కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గపు చట్టంగా అభివర్ణించారు.
అమరావతి: జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తధ్యమని, కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయమని.. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం జిల్లాలోని పలమనేరులో సీఎం జగన్ సభ నిర్వహించారు. అయితే జగన్ సభకు హాజరైన ప్రజల్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సభకు వచ్చిన జనానికి వైసీపీ శ్రేణులు చల్లని పానీయాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తాగిన పలువురకి అనారోగ్యం పాలయ్యారు. వాంతులు అవడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపోతున్నారు.. సరైన సమాధానం చెప్పడానికి ఎందుకు సంకోషిస్తున్నారు.. ప్రశ్నలు అడిగితే టెన్షన్ ఎందుకు పడుతున్నారు.. ఇప్పడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే..
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం దర్శి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకమాట చెప్పి.. అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడుకు తెరతీశారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలకు జగన్ ఖర్చుపెట్టింది చాలా తక్కువే అని.. దీంతో ఏం చెప్పాలో తెలీక జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
Andhrapradesh: రాష్ట్రంలో పండుటాకులపై జగన్ సర్కార్ పగబట్టింది. పెన్షన్‌దారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత రెండు రోజుల పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పెన్షన్ డబ్బులు అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అపసోపాలు పడి బ్యాంకులకు వస్తే బ్యాంకు అధికారులు పెట్టిన రూల్స్‌తో పెన్షన్‌దారులు నీరసించిపోతున్నారు.
అధికారం ఉన్నంత సేపు ఒకరకం.. అధికారం పోతుందంటే మరొక రకంలా తయారైంది ఏపీ సీఎం వైఎస్.జగన్ పరిస్థితి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా వాస్తుని, ముహుర్తాలను నమ్ముతూ ఉంటారు. కానీ జగన్ గత ఐదేళ్ళలో తనకు నచ్చిందే చేసుకుంటూ వెళ్లారు. వాస్తును అసలు పట్టించుకోలేదు. అది అతని వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. అయితే ఐదేళ్ల తర్వాత జగన్‌లో అధికారం కోల్పోతున్నామనే భయం మొదలైందట.