CHANDRA BABU : ఫ్యానకు ఉరి వేయండి!
ABN , Publish Date - May 06 , 2024 | 12:45 AM
‘హలో అనంతపూర్... బైబై వైసీపీ. హలో ఏపీ.. బై బై జగన.. ఇదే మనందరి నినాదం కావాలి. ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో ఫ్యానకు ఉరివేయండి. జగన పార్టీని తరిమేయండి..’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం అర్బన నియోజకవర్గం కేంద్రంలోని సప్తగిరి సర్కిల్‌లో ఆదివారం రాత్రి ప్రజాగళం బహిరంగ సభకు చంద్రబాబు హాజరై ప్రసంగించారు. తెలుగు తమ్ముళ్లు కసి, జనసేన ఆవేశం, బీజేపీ అభిమానం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజాగళం ...
13న జగన పార్టీని తరిమేయండి
25కు 25 ఎంపీ స్థానాలు మనవే..
160 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు మనదే..
ఓటుతో కూటమిని ఆదరించండి
ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు
అనంతపురం, మే 5(ఆంఽధ్రజ్యోతి ): ‘హలో అనంతపూర్... బైబై వైసీపీ. హలో ఏపీ.. బై బై జగన.. ఇదే మనందరి నినాదం కావాలి. ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో ఫ్యానకు ఉరివేయండి. జగన పార్టీని తరిమేయండి..’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం అర్బన నియోజకవర్గం కేంద్రంలోని సప్తగిరి సర్కిల్‌లో ఆదివారం రాత్రి ప్రజాగళం బహిరంగ సభకు చంద్రబాబు హాజరై ప్రసంగించారు. తెలుగు తమ్ముళ్లు కసి, జనసేన ఆవేశం, బీజేపీ అభిమానం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజాగళం కోసం వచ్చిన తనకు అఖండ స్వాగతం పలికారని, అనంతపురం అదిరిపోయిందని అన్నారు. కూటమి అర్బన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో
గెలిపించాలని కోరారు. చంద్రబాబుకు అర్బన జనం నీరాజనం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ప్రజాగళం సభకు జనం పోటెత్తారు. ఈలలు, కేరింతలు, జిందాబాద్‌లతో సప్తగిరి సర్కిల్ మార్మోగింది.
ప్రతి ఎకరానికీ నీరు..
హంద్రీనీవా ఎన్టీఆర్ ఆలోచన అని, రాయలసీమ ఎడారిగా మారకుండా కృష్ణాజలాలను తీసుకొచ్చేందుకు సంకల్పించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ తర్వాత హంద్రీనీవాను తాను పూర్తి చేశానని అన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి కియ పరిశ్రమను ఏర్పాటు చేశామని అన్నారు. కరువు సీమలో 12 లక్షల కార్లు తయారై ప్రపంచమంతా పరిగెత్తుతున్నాయంటే అది టీడీపీ ఘనత అని అన్నారు. ఐదేళ్లలో జగన ఒక్క పరిశ్రమైనా తెచ్చారా అని నిలదీశారు. జిల్లా నుంచి జాకీ పరిశ్రమను తరిమికొట్టారని అన్నారు. టీడీపీ హయాంలో 90 శాతం సబ్సిడీతో రైతులందరికీ డ్రిప్ పరికరాలు అందించామని అన్నారు. జిల్లాలో భూగర్భ జలాలు ఇంకిపోకుండా 10 లక్షల పంట కుంటలు తవ్వించామని అన్నారు. ఈ ఐదేళ్లలో చిన్న పనైనా జరిగిందా..? అని నిలదీశారు. అనంతలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామని, అనంతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అనేక పనులు చేశామని అన్నారు. 2019లో వైసీపీ రాయలసీమలో 49 సీట్లు గెలిచిందని, రాయలసీమకు జగన ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12వేల కోట్లు ఖర్చుపెట్టామని అన్నారు. జగన ఐదేళ్లల్లో రూ.2వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని అన్నారు. రాయలసీమ ద్రోహి జగన అన్నారు.
ముస్లింలకు అండ
ఎన్డీయే కూటమిలో ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరుడికైనా అన్యాయం జరిగిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. రెండు ఉర్దూ యూనివర్శిటీలు, హజ్ హౌస్‌లు కట్టామని అన్నారు. రంజాన తోఫా, దుల్హన పథకాలు అమలు చేయడంతోపాటు ఇమాం, మౌజనలకు గౌరవ వేతనం ఇచ్చామని అన్నారు. అధికారంలోకి రాగానే మక్కాకు వెళ్లేందుకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని, దుల్హన, విదేశీ విద్య పథకాలను ప్రవేశపెడతామని అన్నారు. ఇమాం, మౌజనలకు రూ.5 వేలు, రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తామని అన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడే బాధ్యత తమదని అన్నారు. నూర్ బాషాలకు రూ.100 కోట్లతో ఓ కార్పోరేషన ఏర్పాటు చేస్తామని అన్నారు.
మహిళలకు న్యాయంమహిళలకు న్యాయం
మహా శక్తి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లల్లో రూ.90వేలు జమ చేస్తామని అన్నారు. తల్లికి వందనం ద్వారా రూ.15వేలు చొప్పున ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని అన్నారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. యానిమేటర్లకు న్యాయం చేస్తామన్నారు. జాబ్ రావాలంటే బాబు రావాలని, బాబు రావాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఎయిర్ కార్గో తెస్తాం..
జిల్లాకు ఎయిర్ కార్గో తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పుట్టపర్తిని కేంద్రంగా చేసుకొని విదేశాలకు మీరు పండించిన పంటను ఎగుమతి చేయిస్తామని అన్నారు. రైతును రాజును చేస్తామని అన్నారు. వైసీపీలో సామాజిక న్యాయం నేతిబీర చందమని, తాము రెండు ఎంపీ సీట్లను బీసీలకు ఇచ్చామని అన్నారు. రాయలసీమలో సామాజిక న్యాయం చేశారా అని జగనకు సవాల్ విసిరారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన ఇస్తామని అన్నారు.
ఉద్యోగులు ఓటు వేయకుండా కుట్రలు..
ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు వెళితే వారిని కూడా ఓటు వేయనివ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఉద్యోగులను క్యూలో నిలబెడుతున్నారని, ఇదా పరిపాలన.. అని ప్రశ్నించారు. ఈ పాలనకు చెదలు పట్టింది.. దెయ్యం పట్టింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వదిలిచేందుకు ఎన్డీయే మంత్రం కావాలని అన్నారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. టీడీపీ నాయకుడు జయరాంనాయుడుపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారని, కొందరు అధికారులు టీడీపీ కూటమి నాయకులను చాలా హీనంగా చూస్తున్నారని, ఎవరినీ వదిలి పెట్టబోమని, అందరి పేర్లు ఎన్నికల కమిషనకు పంపిస్తామని హెచ్చరించారు.
సమయం లేదు మిత్రమా..
సమయం లేదు మిత్రమా.. ఏ మాత్రం అశ్రద్ధ వహించకూడదు అని చంద్రబాబు అన్నారు. హలో అనంతపూర్.. బైబై వైసీపీ.. హలో ఏపీ... బైబై జగన అని నినదించారు. కరువు జిల్లాను బాగు చేసేకునేందుకు సిద్ధమా..? వైసీపీని ఓడించేందుకు సిద్ధమా..? అందరూ చప్పట్లు కొట్టి సమర్థించాలని కోరారు. ప్రజలు మద్దతు పలికారు.
అనంత ఏం చేశారు..?
ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, ఆయన తన తండ్రి విగ్రహం పెట్టుకోవడం తప్ప సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో మూడు నెలలో డంపింగ్ యార్డు తరలిస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేకపోయారని అన్నారు. అధికారంలోకి రాగానే అండర్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని, అనంతను స్మార్ట్ సిటీగా తయారు చేస్తామని అన్నారు. అనంత చుట్టుపక్కల పరిశ్రమలు పెట్టి, నగరానికి అనుసంధానం చేస్తామని అన్నారు. బెంగళూరు నుంచి అనంత బార్డర్ వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని అన్నారు. అనంతను ఇండసి్ట్రయల్ కారిడార్‌గా తయారు చేస్తామన్నారు. సెంట్రల్ పార్కును అభివృద్ధి చేస్తామని అన్నారు. ఉద్యోగులు గౌరవంగా ఉద్యోగం చేసే పరిస్థితి తీసుకొస్తామని అన్నారు. పీఆర్సీ, మధ్యంతర భృతి, టీఏలు, డీఏలు, పీఎఫ్ తదితర సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. పెండింగ్‌లోని రూ.20 వేలకోట్లు అందేలా చూస్తామని, ఒకటోతేదీనే వేతనాలు అందజేస్తామని అన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....