AP Elections 2024:ఓటమి భయంతో దాడులు చేస్తున్నారు.. వైసీపీపై పవన్ ఫైర్
ABN , Publish Date - May 05 , 2024 | 10:09 PM
మూడు కబ్జాలు, ఆరు సెటిల్‌మెంట్లుగా వైసీపీ (YSRCP) పాలన ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. తునిలో ఆదివారం ‘‘వారాహి విజయభేరి’’ సభ వేదికగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తునిపై హామీల వర్షం కురిపించారు.
తుని: మూడు కబ్జాలు, ఆరు సెటిల్‌మెంట్లుగా వైసీపీ (YSRCP) పాలన ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. తునిలో ఆదివారం ‘‘వారాహి విజయభేరి’’ సభ వేదికగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తునిపై హామీల వర్షం కురిపించారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించి గౌరవిస్తామని ఉద్ఘాటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా వస్తున్నామని చెప్పారు. తుని తలుపులమ్మ గుడి దగ్గర మౌలిక వసతులు కల్పిస్తామని మాటిచ్చారు. తుని నుంచి విశాఖకు లోకల్ రైలు సదుపాయం కల్పిస్తామన్నారు.
PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన
తునిలో వంద చెరువుల్లో మట్టిని మంత్రి దాడిశెట్టి రాజా తవ్వేశారని మండిపడ్డారు. తునిలో ఆయన ఆగడాలు శ్రుతిమించాయని ఆరోపించారు. తుని మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాండవ నదిలో వైసీపీ పెద్దలు ఇసుక అమ్ముకున్నారని విరుచుకుపడ్డారు. కూటమి గెలిచాక తాండవ, పంపా రిజర్వాయర్లలో పూడిక తీస్తామని అన్నారు. ఓటమి భయంతో కూటమి నేతలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని పవన్‌కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!
Read Latest Andhra pradesh News or Telugu News