Home » CM Jagan
Andhrapradesh: ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తాం’’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను సాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
Andhrapradesh: తిరుపతిలో టీడీపీ అభ్యర్ధి పులివర్తి నానిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చెవిరెడ్డి కొడుకు చేసిన దౌర్జన్యం ప్రజాస్వామ్యానికే మచ్చ అని వ్యాఖ్యలు చేశారు. ఓర్వలేనితనంతో దాడులకు దిగడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఎస్.కోటలో ఓ వైసిపి నాయకుడు కొడుకు టీడీపీకి ఓటు వేయడానికి బెంగళూరు నుంచి వచ్చారన్నారు.
మళ్లీ మేమే గెలుస్తున్నామన్నారు.. మహిళలు, వృద్ధులు, యువత పెద్దఎత్తున ఓట్లేశారని.. ఇవి మాకే పడ్డాయన్నారు.. సోమవారం పోలింగ్ ముగిసీ ముగియగానే..
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు (AP Governor Abdul Nazir) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం ఓ లేఖ రాశారు. అపధర్మ(వైసీపీ) ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను విడుదల చేసేందుకు సిద్ధమైందని.. ఈ బిల్లులను తక్షణమే నిలిపివేయాలని లేఖలో చంద్రబాబు తెలిపారు.
ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా పడిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలిపారు. విశాఖలో భారీగా ఓట్లు పోల్ అయ్యాయని...ఎప్పుడూ ఓటు వేయని వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి నేనే అడ్డుకున్నాను..ఇది దేవుడి కృప అన్నారు.
అమరావతి: అంతన్నారు.. ఇంతన్నారు... ఎన్నికలు కొద్ది రోజుల ముందు తెగ హడావిడి చేశారు. సంక్షేమానికి తానే అంబాసిడర్ అన్నట్లు గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి తాము డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాలు గడవు అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. 10వతేదీ రాత్రికే డబ్బులు ఇవ్వాలన్నట్లు హడావిడి చేశారు. ఎన్నికల కోడ్‌కు ముందు సంక్షేమ పథకాల బటన్ నొక్కి.. సరిగ్గా ఎన్నికలు జరిగే సమయంలో..
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై నేడు సీబీఐ కోర్టులో తీర్పు వెలువడనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్ట్‌లో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. తెనాలి పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వరుసలో రావాలని, మంది మార్బలంతో లోపలికి వెళితే ఎట్లాగంటూ ఆ ఓటరు ప్రశ్నించడమే పాపమైంది. అంతే... వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రెచ్చిపోయారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని మున్సిపల్ హైస్కూల్లోని పోలింగ్ బూత్‌లో పోలిం గ్ ఆలస్యం కావడంతో క్యూలో ఉన్న ఓటర్లు విసుగుచెందారు.
సజావుగా సాగాల్సిన ఎన్నికల వేడుకను వైసీపీ నేతలు (YSRCP Leaders) రసాభసాగా మార్చేస్తున్నారు. అధికార మదంతో పోలింగ్ బూతుల (Polling Booths) వద్ద రెచ్చిపోతున్నారు. తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడమే కాదు.. సజావుగా సాగాల్సిన ఎన్నికల వేడుకను వైసీపీ నేతలు రసాభసాగా మార్చేస్తున్నారు. అధికార మదంతో పోలింగ్ బూతుల (Polling Booths) వద్ద రెచ్చిపోతున్నారు.