Share News

Devineni Uma: జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం

ABN , Publish Date - May 17 , 2024 | 04:46 PM

Andhrapradesh: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ క్యాబినేట్‌లో ఉన్న 40 మంత్రలు ఓడిపోతున్నారని.. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టమైందన్నారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ సజ్జల యత్నిస్తున్నారని మండిపడ్డారు.

Devineni Uma: జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం
TDP Leader Devineni Uma

అమరావతి, మే 17: వైసీపీకి (YSRCP) ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Former minister Devineni Umamaheshwar Rao) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ క్యాబినేట్‌లో ఉన్న 40 మంత్రలు ఓడిపోతున్నారని.. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. జగన్ రెడ్డి (CM Jagan Reddy) మాటల్లో ఓటమి భయం స్పష్టమైందన్నారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ సజ్జల (Sajjala Ramakrishna Reddy) యత్నిస్తున్నారని మండిపడ్డారు. అబద్దాలు చెబుతున్నారన్నారు. జగన్ రెడ్డి లండన్ పారిపోతున్నారని... పెద్దిరెడ్డి పీఎల్ ఆర్ కంపెనీ వెహికిల్స్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు.

Aam Aadmi Party: స్వాతి మలివాల్‌‌కు వైద్య పరీక్షలు: గాయాలు


వైసీపీ సోషల్ మీడియా దుకాణం సర్దుకుందని... సజ్జల భార్గవ్ హైదరాబాద్ వెళ్లిపోయారన్నారు. భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అరాచకాలకు కారకులైన జగన్ రెడ్డి, ఆయన తాబేదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డి, జవహర్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఆంజనేయులు లాంటి అధికారులు, నాయకులు మూల్యం చెల్లించుకుంటారని దేవినేని ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

Nakka Anadbabu: అధికార మార్పు తథ్యం... అక్రమార్కులకు శిక్ష ఖాయం

AP Elections 2024: ఏపీలో పలువురు అధికారుల బదిలీలు.. కారణమిదే..?

Read Latest AP News And Telugu News

Updated Date - May 17 , 2024 | 04:58 PM