Home » Congress 6 Gurantees
Telangana: వంద రోజుల పాలన సంతృప్తిగా ఉందని సీఎం రేవంత్ రెడ్డ్ి అన్నారు. వందరోజుల్లో ప్రజలు చూపించిన సానుభూతి మరువలేనిదని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాట ఇస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కస్తామన్నారు. 8 లక్షల మంది 500 రూపాయలకే సిలిండర్ కొన్నారని.. 37 లక్షల మందికి జీరో బిల్ ఇచ్చామని తెలిపారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)ను అరెస్టు చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటుతో మూడు సీట్లు గెలవచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆశ పెట్టుకున్నారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) అన్నారు. రేపు(శనివారం) ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు కవిత ఇంటి మీద ఐటీ, ఈడీ, సీబీఐ పోలీసులతో మోదీ, అమిత్ షా దాడి చేయించి అరెస్టు జేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కమిటీలకే పరిమితమైందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కమిటీల్లో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు.
6 గ్యారంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మాట తప్పిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కిట్లు ఇస్తే, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తిట్లలో పోటీ పడుతున్నారని ఆరోపించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని పలు సర్వేలు చెబుతున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటువేయాలని చెప్పారు. ముఖ్యంగా మల్కాజ్గిరి సీటును తిరిగి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.
రేషన్ కార్డులు లేకున్నా ప్రభుత్వ పథకాలు అందుతాయని.. ప్రజలు కంగారు పడవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట సమీపంలో రూ. 74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్ రూం ప్లాట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటాలు చేస్తుంది తప్పితే రాష్ట్రంలో పథకాలు అమలైన దాఖలాలు లేవని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(DK Aruna) అన్నారు. మంగళవారం నాడు అరుణ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి కార్యకర్తలు ప్రచారం నిర్వహించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీలోనే ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్(Vivekananda Goud) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము గెట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్‌లోకి వస్తారని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. గేట్లుతెరిస్తే రావడానికి తమ ఎమ్మెల్యేలు గొర్రెలు కాదని మండిపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను అమల్లోకి తీసుకువస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. మహిళలు అన్నిరంగాల్లో నిలదొక్కుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పాటుపడుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మంగళవారం నాడు క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు సీఎం రేవంత్, మంత్రులు అమోదం తెలిపారు. ఈ భేటికి సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాకు తెలిపారు.