Home » Congress 6 Gurantees
తొమ్మిదేళ్లు తెలంగాణలో ప్రజా కంటగింపు పాలనను చూశామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కేసీఆర్ ఇక అధికారంలోకి రాడని.. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలను ఒకలా.. హిందువులను మరోలా చూస్తున్నారని ధ్వజమెత్తారు.హిందువుల ఇళ్లను మాత్రమే హైడ్రా కూలుస్తుందని ఎంపీ అరవింద్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆసరా పథకం పైసలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని ప్రశ్నించారు.
వ్యాపారవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను పవర్ సెంటర్ కావడం అనేది భవిష్యత్ నిర్ణయిస్తుందని అన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
కాంగ్రెస్ ఎగవేత... కోతల ప్రభుత్వమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన ఎల్లప్పుడూ వారి సేవలోనే ఉంటానని తెలిపారు. పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు బంగారం మాటలకే పరిమితమైందని హరీష్‌రావు విమర్శించారు,
తెలంగాణకు పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. మంగళవారం న్యూయార్క్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఆయన సమావేశమయ్యారు.
స్వాతంత్ర దినోత్సవాన.. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ చేతుల మీదుగా మూడో విడత రుణ మాఫీ చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
వైద్య విద్యలో సీట్ల భర్తీకి స్థానికత విషయంపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. స్థానికత విషయంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాజనర్సింహ కూడా ఎక్స్‌లోనే సమాధానం ఇచ్చారు.
రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు రైతు రుణమాఫీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనం లేకుండా.. కేవలం రైతు ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని తెలిపారు.
ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం తమదని.. దానిని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.