CM Revanth Reddy: దేశానికి తెలంగాణ మోడల్
ABN, Publish Date - Mar 20 , 2025 | 06:24 PM
దేశానికి తెలంగాణ రాష్ట్రం మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేయని పనులను తమ ప్రభుత్వం పది నెలల్లో చేసి చూపించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

దేశానికి తెలంగాణ రాష్ట్రం మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేయని పనులను తమ ప్రభుత్వం పది నెలల్లో చేసి చూపించిందని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టే యువత బీఆర్‌ఎస్ పార్టీని ఓడించారన్నారు. కారుణ్యం అనే పదానికి బీఆర్ఎస్‌కు అర్థం తెలియదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలోనే ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు పట్టించుకున్నారా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
కారుణ్య నియామకాలు కల్పించకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కారుణ్య నియామకాలు క్రమం తప్పకుండా ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యత అని తెలిపారు. జాబ్ క్యాలెండర్‌తో పాటు కారుణ్య నియామకాలు కూడా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశపడ్డారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదినెలల్లో 59 వేల ఉద్యోగాలు ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 20 , 2025 | 06:34 PM